రెండవ పెళ్లిపై తేల్చేసిన రేణుదేశాయ్‌

0
431
Renu Desai Told Me That She would Not Be Married

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చిన్న వయస్సులోనే పవన్‌ కళ్యాణ్‌తో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఇద్దరు పిల్లలను కూడా కన్న రేణుదేశాయ్‌ అదే చిన్న వయస్సులో భర్త పవన్‌ నుండి విడిపోయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో ఉంటున్న రేణుదేశాయ్‌ కొన్ని రోజుల క్రితం రెండవ పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. రెండవ పెళ్లి చేసుకోవడం వల్ల తనకు భర్త మాత్రమే లభిస్తాడని, తన పిల్లలకు తండ్రి కాలేడు అంటూ రేణు దేశాయ్‌ భావిస్తుంది. రెండవ పెళ్లి గురించి సుదీర్ఘంగా ఆలోచించినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

ఎట్టకేలకు రెండవ పెళ్లిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది. రెండవ పెళ్లి చేసుకోబోను అని, తాను జీవితాంతం పవన్‌ కళ్యాణ్‌ రెండవ భార్యగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. పవన్‌ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చిన రేణుదేశాయ్‌ మరో వ్యక్తిని ప్రేమించలేను అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రేమ విషయంలో ఫిలాసఫీగా మాట్లాడిన రేణుదేశాయ్‌ సెకండ్‌ మ్యారేజ్‌పై వస్తున్న పుకార్లను కొట్టి పారేసింది. తన జీవితం అంతా కూడా తన పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Leave a Reply