‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ దగ్గరకు ఎవరైనా సహాయం చేయాలి అని కోరితే వాళ్ళ అవసరాలు తెలుసుకొని తనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సహయం చేస్తాడు అని అందరికి తెలిసిన విషయమే.
కాని ఇప్పుడు సహాయం చేసింది పవన్ దగ్గరకు వచ్చిన వాళ్ళకు కాదు, కళ్యాణ్ నువ్వు ఒక అమ్మాయికి సహాయం చేయాలి అని ఒకరు చెప్పడంతో వెంటనే సహాయం చేసాడు. సహాయం చేయాలి అని చెప్పిన వాళ్ళు ఎవరని అనుకుంటున్నారా..? ఆమె ఎవరో కాదు , పవన్ మాజీ భార్య ‘రేణు దేశాయ్’.
అసలు సంగతేంటంటే.. లక్ష్మీ దుర్గా అనే అమ్మాయి డిగ్రీ చదువుతుంది, ఆ అమ్మయి తండ్రి సడన్ గా చనిపోవటంతో కాలేజీ ఫీజ్ కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది, అప్పుడు ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్ధం కాక సోషల్ మీడియాలో తనకు సహాయం చేయాలి అని మెసేజ్ పెట్టింది, అందరు అది ఫేక్ మెసేజ్ అని ఎవరు పట్టించుకోలేదు కానీ రేణు ఆ మెసేజ్ కి స్పందించి , ఎంక్వయిరీ చేసి ఆ అమ్మాయి నిజంగానే ఆపదలో ఉంది అని తెలుసుకొని పవన్ చేత సహాయం చేయించింది. ఈ విషయం ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవన్ కి రేణు కి కృతజ్ఞతలు చెప్పింది.