ఒక్కోసారి ఎదుటి వాళ్ళను గుర్తుపట్టలేక పోవచ్చు …వాళ్ళ పేర్లు మర్చిపోవచ్చు…కానీ మన పేరు మనమే మర్చిపోతే …ఆ సమయంలో అందరూ మనల్నే చూస్తుంటే …ఆ ఇబ్బంది అంతా ఇంతా కాదు.అలాంటి పరిస్థితి ఎదురైంది కొత్తగా కేంద్ర మంత్రి వర్గంలోకి వచ్చిన ఓ పెద్దాయనకి…
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ రామ్ దాస్ అథవాలె కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు తడబడిపోయారు.తమపేరు మర్చిపోయారు…పేరు చెప్పకుండా ప్రమాణస్వీకారం చేయబోయారు.రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ముందు మీపేరు చెప్పమనడంతో …తేరుకున్న అథవాలె తప్పు సరిదిద్దుకొన్నారు..కొత్తగా పదవిలోకి వచ్చేటప్పుడు ఆ మాత్రం తడబాటును అర్థంచేసుకోవచ్చులే….