రేష్మితో ఈసారి రొమాన్స్ చేసేది ఎవరంటే..!

reshmi nandu next movie

మొదట సినిమాల్లో ప్రయత్నించినా చిన్నా చితకా వేశాలే వస్తున్నాయని బుల్లితెరకు షిఫ్ట్ అయిన రేష్మి ఇక స్మాల్ స్క్రీన్ పై సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీతో కాస్త హీరోయిన్ గా కాదు కాదు హాట్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకునేలా చేసుకున్న రేష్మి ఇప్పుడు అలాంటి సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ అయ్యింది. సినిమా తీయాలి కాని పెట్టిన డబ్బులు డబుల్ రావాలి అనుకునే దర్శక నిర్మాతలంతా రేష్మి జపం చేస్తున్నారు.

ఇక అమ్మడు కూడా అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శన చేయడంతో ఫుల్ ఫాంలో ఉంది. గుంటూర్ టాకీస్ తో తలరాత మార్చుకున్న రేష్మి ఆ తర్వాత కూడా అదే రచ్చ కొనసాగించింది. అంతం, రాణిగారి బంగ్లా ఇలా రేష్మి కనబడితే హాట్ కేకే అన్న సందర్భం కనబడుతుంది. అయితే ప్రస్తుతం తను వచ్చెనంట సినిమా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న రేష్మి యాంకర్ గా ఉన్నప్పుడు తనతో హోస్ట్ గా చేసిన నందుతో కలిసి ఓ సినిమాలో నటిస్తుందట. ఫోటో సినిమాతో హీరోగా చేసినా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఓ ఐడెంటిటీ ట్రై చేస్తున్నాడు నందు. ఇక రీసెంట్ గా వచ్చిన పెళ్లిచూపులు సినిమాలో భాగమై ఆ హిట్ కు తానో లక్కీ అని నిరూపించాడు.

ప్రస్తుతం హీరోగా ప్రయత్నాలు చేస్తున్న నందుకు రేష్మి హీరోయిన్ గా చేస్తున్న మూవీలో అవకాశం దక్కింది. ఇక రేష్మి ముందు సినిమాల్లానే ఈ మూవీ కూడా హాట్ హాట్ గా రెచ్చిపోనుందట. మరి నందు రేష్మిల రొమాన్స్ సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

SHARE