తెలంగాణ బిడ్డలా..? ఆంధ్రా కుక్కలా..?

182
Spread the love

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

revanth reddy calls andhra pradesh people as dogsతెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై విమర్శల ఘాటు పెంచేశారు. ప్రత్యేకించి ఆంధ్రా వ్యక్తులకు తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తుందని ఆరోపిస్తూ ఆయన తాజాగా చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. ఓవైపు ఆంధ్రాలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే.. ఇక్కడ ఆంధ్ర వ్యక్తులపై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం విశేషం. తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపించిన కేసీఆర్.. ఇప్పుడు ఆంధ్రావారికి ప్రయారిటీ ఇస్తూ తెలంగాణ వాళ్లను అణగదొక్కేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ మెట్రో రైల్ సీఎండీగా ఆంధ్రాకు చెందిన ఎన్వీఎస్ రెడ్డిని మరో ఐదేళ్లపాటు కొనసాగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా గర్హించారు. అలాగే ఐ.ఐ.టి.ఆర్. కు కృష్ణా జిల్లాకు చెందిన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని సీఈవోగా నియమించారని.. ఆ పోస్టుకు తెలంగాణలో టాలెంట్ ఉన్న వ్యక్తులే లేరా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. తాజాగా సినీనటుడు నాగార్జున భార్య అమలకు జూబ్లీహిల్స్ లో అతి ఖరీదైన ప్రాంతంలో పిచ్చికుక్కలను పెంచుకునేందుకు మూడు ఎకరాల స్థలం కేటాయించడాన్ని కూడా రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.

హైదరాబాద్ లో ఆంధ్రా కుక్కలకు ఉన్న విలువ కూడా తెలంగాణ బిడ్డలకు లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రా వ్యక్తులైతేనే తమకు బాగా కమీషన్ ఇస్తారని వారికి కీలకపదవులు కట్టబెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా బాగో అన్న టీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు మౌనంగా ఉంటే.. కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డి ఆంధ్రా వారిని టార్గెట్ చేస్తున్నారనేది కాంట్రవర్సియల్ పాయింట్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here