ఎంసెట్ లీకేజీ కుట్రలో రాజకీయ నేతలు?

0
499

revanth reddy eamcet
ఎంసెట్ లీకేజీ కుంభకోణం విలువ అంతకంతకు పెరిగిపోతోంది .దాదాపు 50 కోట్లు పైనే చేతులు మారినట్టు తెలుస్తోంది .ఇంత పెద్ద కుంభకోణంలో రాజకీయ నేతల పాత్ర కూడా ఉందా ? ఎస్ అంటున్నారు దేశం నేత రేవంత్ రెడ్డి .సూత్రధారులు బయటపడకుండా …కేవలం పాత్రధారులని పోలీసులు జనం ముందుకు తెస్తున్నారని అయన ఆరోపణ .అయితే ఆయన కూడా ఎవరి పేరు ప్రస్తావించలేదు .దీంతో రేవంత్ ఓ రాయి వేసి చేసారన్న విమర్శలు వస్తున్నాయి.

అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇలాంటి వ్యవహారమే నడుస్తోంది ..తెలంగాణ విషయం బయటపడగానే ఆంధ్ర ఎంసెట్ పై సాక్షి పత్రిక సందేహాలు వెలిబుచ్చింది .దీనిపై మంత్రి కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు .విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని సలహా ఇచ్చారు .మొత్తానికి రాజకీయ ఆరోపణలతో లీకేజీ కాక ఇంకాస్త పెరిగింది .

Leave a Reply