Posted [relativedate]
టి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాజీ సి.ఎం రాజశేఖర్ రెడ్డి ని ఫాలో అవుతున్నారా ఐ మీన్ సెంటిమెంట్ లని ఆమాట కొస్తే పెరటి వారికీ ఒకో సెంటిమెంట్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం ఇటీవల సెంటిమెంట్లను బలంగా నమ్ముతున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం పెద్దమ్మతల్లి దేవాలయం నుంచి సైకిల్ పై పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇక పై ఏ కార్యక్రమమైనా పెద్దమ్మతల్లి ఆశీస్సులతో చేపడతానని ప్రకటించారు. రేవంత్ నోట మరో సెంటిమెంట్ అంశం వెల్లడైంది. పెద్దపల్లిలో రైతు పోరు యాత్ర సందర్భంగా ఈ సెంటిమెంట్ ని రేవంత్ తెర మీదకు తెచ్చారు.
భూపాలపల్లి నుంచి రైతు పోరు యాత్ర ప్రారంభించిన తనకు, పార్టీ సీనియర్ నేత సీతక్క కుంకుమతో వీరతిలకం దిద్ది ఆశీర్వదించి, యాత్ర ప్రారంభింపజేశారని . ఈ సంఘటనను రేవంత్ సెంటిమెంట్ గా భావిస్తున్నారట.
అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కలిసొచ్చిన సెంటిమెంటే ఇప్పుడు తన విషయంలో కూడా పనిచేస్తుందని రేవంత్ సెంటిమెంట్ అట 2003 తర్వాత ఎన్నికల్లో, ఆ తర్వాత ఎన్నికల్లో వైఎస్ ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి సబితను చెల్లెమ్మగా ఆదరించారు వైఎస్. ఏ పని చేసినా చేవేళ్ల చెల్లెమ్మ ఆశీస్సులతో ప్రారంభించాలని, ఓ సెంటిమెంట్ గా వైఎస్ భావించారు.
అలాంటి సెంటిమెంట్ నే ఇప్పుడు రేవంత్ నమ్ముతున్నారు. “నాడు వైఎస్ కు సబితక్కలా… నేడు తనకు సీతక్క” ఎదురొచ్చి యాత్ర ప్రారంభింపజేశారని… ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని బహిరంగ సభలోనే రేవంత్ ప్రకటించారు. సెంటిమెంట్ పవర్ కొన్నాళ్ళు వేచి చుస్తే తప్ప తెలియదు కదా ..