Posted [relativedate]
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీలో అంతగా ప్రాచుర్యం లోకి రాక పోయినా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశంపార్టీ జాతీయపార్టీగా అవతరించిన తరువాత రేవంత్ రెడ్డికి మాత్రం బోలెడు పాపులారిటీ వచ్చింది. మొదటినుంచి కెసిఆర్ తరహా లోనే పంచ్ డైలాగులు మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి చంద్ర శేఖరరావు మీద ఒక రేంజ్ లో ఫైర్ అవుతూ వచ్చి అసెంబ్లీ నుంచి దాదాపు గెంటించుకొన్న అంత పని జరిగిన నేత రేవంత్ ఒక్కరే. మొదటి నుంచి ఉప్పు నిప్పులా ఉన్న కేసిఆర్ రేవంత్ రెడ్డి మీద పగ పెట్టారనే చెప్పాలి. అసలు ఓటుకు నోటు పుట్టిందే రేవంత్ కోసం అన్నట్టు స్టీఫెన్ ని తయారు చేసారు ఆంగ్లో ఇండియన్ కోటాలో ఉన్న సీట్ ని కొనేలా ప్లాన్ చేసినట్టు నటించిన స్టీఫెన్ ముఖ్యమంత్రి చెపినట్టు విన్నారు.ఫలితం గా తెలుగు దేశం పార్టీ అతలాకుతలం అయ్యే పరిస్థితి దాపురించింది..ఆతరువాత పరిణామాలు అందరికి తెలిసినవే కెసిఆర్ తెలివి తేటలు వాడి ఆధిక్యత ప్రదర్శించినా ఆ తర్వాత తేరుకున్నతెలుగుదేశం నాయకులూ చిన్న లాజిక్ ను వాడి తెలంగాణ ముఖ్య మంత్రిని నిలువరించ గలిగి దూకుడికి కళ్లెం వేసారు. కొన్నాళ్లుగా రేవంత్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఏమి మాట్లాడటం లేదు అడపాదడపా మాటలే తప్ప ఇంతకుముందు ఉన్న దూకుడు లేదనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు కూడా అంత గా తెలంగాణ మీద ద్రుష్టి పెట్టట్లేదు ఆయనకి ఆంధ్ర డెవలప్మెంట్ తోనే సరిపోతోంది. తెలంగాణలో వుంటారు అనుకున్న నేతలు అందరూ జెండా మార్చేసినా ఆ సత్తుపల్లి ఏంఎల్ ఏ సండ్ర వెంకవీరయ్య, ఎల్ బి నగర్ ఏం ఎల్ ఏ కృష్ణయ్య , రమణ ,రావుల ఇలా కొందరు మాత్రం విధేయంగా పార్టీని అంటి పెట్టుకొని వున్నారు..తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యం లో మళ్ళీ రేవంత్ రెడ్డి వైపు జనం చూపు మళ్లుతోంది..మొదటినుంచి ఫైర్ తో జనాన్ని ఆకట్టు కోవటమో ఏమో కానీ రేవంత్ అంటే జనంలో ఒక క్రేజ్ వచ్చేసిందని చెప్పాలి. రేవంత్ గురించి తాజా పరిణామాల్ని చుస్తే.టీడీఎల్పీలో రేవంత్ ను నక్సల్స్ బాధిత కుటుంబ సభ్యులు కలిశారు వారి సమస్యల్ని వివరిస్తూ .
- గతంలో మా కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేది.
- ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేవారు.
- 2015 లో ఆ జీవో రద్దు చేశారు.
- కొత్త విధానం తెస్తామని ఏడాదైంది.
అసెంబ్లీలో మా సమస్య ప్రస్తావించండి.అంటూ విన్నవించారు
ఇక రైతులు విషయం లో ఇప్పటికే నకిలీ విత్తనాల వ్యవహారం పై హైకోర్టులో రేవన్తం పిల్ వేశారు. - ఫిరాయింపులకు సంబంధించి ఈ నెల 21 తో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుంది.
- 2 మంది ఎమ్మెల్యేల పై వేటు వేసే వరకు మా సంఖ్య 15నే.
ఆ ప్రకారం మాకు సీట్ల కేటాయింపు, మాట్లాడే సమయం కేటాయించాలి.
ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతానికి మించి ఉన్నవారికి కేబినెట్ హోదా తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు .మొత్తానికి రేవంత్ సుప్రీమ్ అయ్యేలాగే ఉన్నారు తెలంగాణ టీడీపీ లో …