Posted [relativedate]
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ కూతురు నిశ్చితార్ధం ఇటీవల జరిగింది ఈ కార్య క్రమానికి పలు పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి- కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క- కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా వెళ్లారు ..అసలే పొలిటికల్ నాయకులూ అందరూ హాట్ స్టార్ లే ఇంకేముంది సరదా సంభాషణ లు స్టార్ట్ అయ్యాయి రేవంత్‌రెడ్డిని చూసి వి.హనుమంతరావు ఏం తమ్ముడూ… మా వాళ్లకు ఏ ఇష్యూలు మిగిల్చేలా లేవు.. అన్నింటిపైనా నువ్వే పోరాడతావా?వెరీ గుడ్ అన్నారు అట.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చూసి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్.. ‘మా రేవంత్‌రెడ్డి జెట్‌స్పీడ్‌తో వెళుతున్నాడు..మీలో ఆ స్పీడ్ లేదు అని సెటైర్ వేసాడట సంధానం గా భట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు చెందిన వారే పోరాడి ఉద్యమాన్ని నిలబెట్టాయి కానీ క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఉద్యమ చీఫ్ అన్న పేరుతో ఎగరేసుకు పోయాడు అన్నారట. రేవంత్‌రెడ్డి చేస్తున్న పోరాటం కాంగ్రెస్ కి లాభం అన్నారట,వెంటనే రేవంత్ అందుకొని ప్రజలు ప్రతీసారి మోసపోరు. అప్పట్లో కేసీఆర్ మాయమాటలను కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శించి కాంగ్రెస్‌కు రావలసిన మైలేజ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు అని కౌంటర్ ఇచ్చాడట..