స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతాం..

Posted December 17, 2016

revanth reddy said to No-confidence motion on speakerప్రభుత్వం నిర్లజ్జగా వ్యవహరించి సస్పెండ్ చేయించిందని విపక్షాలు అంటున్నారు..సమన్వయము తో వ్యవహరించి సభని నడిపించాల్సిన స్పీకర్ పక్ష పాతం గా వ్యవహరించారని అంటున్నారు ..తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక బిల్లులు చర్చకు వచ్చే సమయం లో ఇలా చేయడం వల్ల ప్రభుత్వం గట్టెక్కుతుందని చర్చ నుంచి తప్పించుకోవడం కోసం ఎలా చేసారని అన్నారు,స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టె ఆలోచనను కూడా ప్రతిపక్షం తో కలిసి పని చేస్తామని అంటున్నారు..కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రం మార్క మాట్లాడుతూ తాను వెల్ లోకి వెళ్ళకపోయినా సస్పెండ్ చేసారని అన్నారు.

ఇప్పటికైనా స్పీకర్ జోక్యం చేసుకుని సస్పెషన్ ఎత్తివేయాలని కోరారు. సభ నుంచి బయటకు వచ్చాక మార్షల్స్ భౌతికంగా లాగిపడేసి టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. తమకు జీతం ముఖ్యమంత్రి ఇంటి నుంచి ఇవ్వడం లేదని, సభ్యుల పట్ల గౌరవంగా వ్యవహరించకపోతే ప్రివిలజ్ మోషన్ పెట్టి సస్పెండ్ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే స్పీకర్ పై అవిశ్వాసం పెడతామని, దీనిపై మిగతా పార్టీలతో చర్చిస్తామని రేవంత్ మాట్లాడారు.

SHARE