మీకేం భయం లేదు నేనున్నా…

  రేవంత్ దీక్ష కు సిద్ధమయ్యాడు.బయలుదేరే ముందు అమ్మ అనుగ్రహం కోసం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుళ్లో ప్రత్యేక పూజలు చేశారు.ఆతర్వాత దీక్ష ప్రారంభించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా తెదేపా తెలంగాణ శాసనసభాపక్షనేత రేవంత్‌రెడ్డి మెదక్‌ జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో దీక్ష ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఆయన ఈ దీక్ష చేయనున్నారు. వేలాది రైతులకు న్యాయం జరగటానికే దీక్ష చేపడుతున్నట్లు రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.మరి ఈ దీక్ష తెలంగాణ ప్రభుత్వం పై ఎంతవరకు ప్రభావం చూపుతుందో,తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ అస్తిత్వం కోల్పోతున్న తరుణంలో ఒంటరి పోరాటం చేస్తున్న రేవంత్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం ….

Leave a Reply