Posted [relativedate]
తెలంగాణ టీడీపీ అగ్గిబరాటా రేవంత్ రెడ్డికి.. టీఆర్ఎస్ కు అస్సలు పడదు. ఆయన ఎప్పుడు చూసినా కేసీఆర్ ను విమర్శిస్తుంటారు. అలాంటి రేవంత్ రెడ్డి… కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు. నిజానికి ఇది అంత ఈజీగా సాధ్యం కాదు కూడా. కానీ రేవంత్ రెడ్డి సెటైరిక్ గా ఆ థ్యాంక్స్ అనే మాటను వాడారు.
వర్గీకరణ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని అప్పుడేమో సీఎం కేసీఆర్ మాట ఇచ్చారట. కానీ ఆ హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు. దీంతో మాదిగల సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం తరపు నుంచి రివర్స్ కౌంటర్ వచ్చింది. రేవంత్ రెడ్డి మాదిగ కాదు కదా.. ఆయనెందుకు అన్నట్టు మంత్రి హరీశ్ రావు మాట్లాడారట. నువ్వేమైనా మాదిగవా… అంటూ అసహనం వ్యక్తంచేశారట. అంతే మాటల మరాఠి అయిన రేవంత్ .. ఇష్యూను తనకు అనుకూలంగా మల్చుకున్నారు.
తాను మాదిగ కులంలో పుట్టలేదు. కానీ వారి గురించి మాట్లాడే బాధ్యత తనపై ఉందని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. అంతేకాదు మాదిగ సోదరుల్లో తనను ఒకడిని చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పారు. ఇదంతీ రేవంత్ రెడ్డి ధన్యవాదాల సంగతి!!
రేవంత్ రెడ్డి అక్కడితో ఊరుకోలేదు.. మాదిగలు ఈ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టడం ఖాయమని మండిపడ్డారు. తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే మాదిగ సోదరల గుండెల్లో ఉంటానని భారీ డైలాగులు చెప్పుకొచ్చారు. నిజంగా రేవంత్ రెడ్డి గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒంటరైపోయినా టీఆర్ఎస్ కు దీటుగా స్పందించడం మాటలు కాదు.