జగన్ కి యాక్షన్ రోల్ ఇచ్చిన వర్మ…జర్నలిస్టులు హ్యాపీ

Posted February 2, 2017

rgv gave action role to jagan
రామ్ గోపాల్ వర్మ …ఆయన ఎక్కడినుంచి ఎక్కడికి అడుగేస్తాడో,ఏ టాపిక్ ని ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో ఊహించడం కష్టం.ఆ కోవలోనే ఇప్పుడు ఏపీ మ్యాప్ ని గన్ తో పోల్చిన వర్మ ఆ మ్యాటర్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు.ఏపీ అనే తుపాకిని పేల్చి దాని సమస్యల్ని దూరం చేయగల సత్తా వున్న షూటర్ జగన్ మోహన్ రెడ్డి అని ట్వీట్ చేశాడు.మెగా ఫామిలీ నుంచి ఎదురుదాడి మొదలు కావడం …ముఖ్యంగా పవన్ కళ్యాణ్..”పెళ్ళైన కూతురు ఉండి కూడా పోర్న్ సినిమాలు చూస్తానని చెప్పే వారి గురించి ఏమి మాట్లాడతామని ” కౌంటర్ వేసేసరికి వర్మ రూట్ మార్చుకున్నట్టుంది.ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నాడు.అయితే ఆ పార్టీ శ్రేణులు వర్మ కామెంట్స్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాయి.ఎందుకంటే వర్మ చేతిలో ట్విట్టర్ ఎప్పుడు ఏమి పలుకుతుందో ఎవరికి ఎరుక అంటున్నారు.వారి భయంలోనూ అర్ధముండని ఇప్పటికే పవన్ ఎపిసోడ్ లో తేలిపోయిందిగా.ఏదేమైనా జగన్ కి యాక్షన్ రోల్ ఇచ్చిన వర్మ యధాప్రకారం మరోసారి వార్తల్లో నిలిచాడు.

రామ్ గోపాల్ వ్యవహారశైలిని కొందరు తిట్టుకుంటుంటే ..మరికొందరు పొగిడేస్తున్నారు.ఆయన్ని నెత్తికెత్తుకుంటున్న వారిలో జర్నలిస్టులు ముందుంటున్నారు.వర్మ యాక్టివ్ గా సెన్సషనల్ వార్తల కోసం వెదుక్కునే పనిలేదు.పనిలోకి దిగేముందు ఒక్కసారి వర్మ ట్విట్టర్ అకౌంట్ చూస్తే చాలు కావాల్సినంత మసాలా.దాన్ని ఉన్నదున్నట్టు వండినా చాలు …అదనపు మసాలా దట్టించాల్సిన అవసరం లేదు. అందుకే వర్మ ఎప్పటికీ ఫామ్ లో వుండాలని కోరుకుంటున్నారు జర్నలిస్టులు.ఆయన చెలరేగితే వాళ్లకి హ్యాపీ.అంతే కదా ఎవరి పాట్లు వారివి.

rgv gave action role to jagan

SHARE