రాంగోపాల్ వర్మ నెక్స్ట్ బాంబు శశికళ అట..

Posted December 16, 2016

rgv next target sashikalaవివాదాలకు కేంద్రం గా మారుతున్నరాంగోపాల్ వర్మ మరో సినిమా బాంబుని తీసేందుకు సిద్ధం అయ్యాడు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు , ప్రస్తుత అన్నా డీ ఏం కె కార్యదర్శి శశికళ లైఫ్ ని సినిమాగా తెరకెక్కించ బోతున్నాడట. శశికళ అనే పేరుతో ఓ ఫిక్షనల్ డ్రామాను తెరకెక్కించనున్నానని… ఓ రాజకీయ నాయకురాలి స్నేహితురాలి జీవితం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్విట్టర్లో వర్మ తెలిపాడు. శశి కళ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేసాడట..

పరిటాల రవి కధ ఇతి వృత్తం గా రక్త చరిత్ర 1 ,2 ,ఆ తర్వాత వంగవీటి రాధా, నెహ్రు ఇతివృత్తం గా వంగ వీటి చిత్రాలను తీసి వివాదాస్పద దర్శకుడిగా ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకొన్న రాంగోపాల్ వర్మ ఇప్పుడు శశికళ పేరుమీద సినిమా తీస్తా అనడం హాట్ టాపిక్ గా మారుతోంది …ఇలాంటి ట్వీట్ లు చేసి రెసుల్త్ కోసం చూసి ముందుకు వెళ్లడం వర్మ ట్రిక్స్ లో ఒక భాగం

Jayalalitha seen through the eyes of Shasikala is much more poetic and honest thought than seeing Jayalalitha only through Jayalalitha

SHARE