Posted [relativedate]
మెగా స్టార్ అభిమానిగా చిరంజీవి కూడా ఇలాంటి సినిమా తీసి తెలుగు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా.. ఈ ట్రైలర్ చూస్తుంటే కత్తి కన్నా మెగా షార్ప్ అయిన ట్రైలర్ ఇది.. ఇక శాతకర్ణి ఫైట్ చూస్తుంటే సంక్రాంతి ఫైట్ వన్ సైడ్ అని తేలిపోయిందంటూ ఈరోజు సాయంత్రం రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ తో ఓ పక్క శాతకర్ణిని ట్రైలర్ ను పొగుడుతూ మరో పక్క మెగా ఫ్యాన్స్ కు మెగాస్టార్ కు చాలెంజ్ విసిరాడు రామ్ గోపల్ వర్మ.
తను ఏం చేసినా అది ఓ సంచలనం అన్నట్టు ప్రవర్తించే వర్మ శాతకర్ణి ట్రైలర్ తో మరోసారి మెగా ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు. జెన్యూన్ గా మెగా ఫ్యాన్స్ చెప్పండి మెగాస్టార్ బాహుబలి, శాతకర్ణి లాంటి సినిమాలు తీయగలడా అని ట్వీట్ చేశాడు వర్మ. అయితే సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది అని చెప్పడం అందరు చేసే పని కాని ఆ సినిమాను పోల్చుతూ మెగాస్టార్ మూవీని ఆడుకోవడం వర్మకే చెల్లింది. తెలుగు సినిమాను మర్ లెవల్ కు తీసుకెళ్తున్న క్రిష్ కు కృతజ్ఞత తెలుపుతూ బాలకృష్ణ కు కంగ్రాట్స్ చెప్పాడు రాం గోపాల్ వర్మ.