Home Uncategorized కీళ్లవాతం..గురించి క్లుప్తం గా...

కీళ్లవాతం..గురించి క్లుప్తం గా…

Posted [relativedate]

rheumatoid arthritis feet reasons and solutionsరుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్(కీళ్లవాతం) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఎక్కడ చెప్పేవి కేవలం అవగాహన కోసమే అనేది గుర్తుంచుకోండి. సమస్య తీవ్రతని బట్టి డాక్టర్ ని సంప్రదించండి..

మన ప్రతి కదలికకూ కీలు..కీలకం జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే… మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. శరీరం లో ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం.ఈ కీళ్లకు వచ్చే అతి పెద్ద సమస్య ఆర్త్థ్రెటిస్‌!కీలు లోపలంతా వాచిపోయి.. కదపాలంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో.. జాయింటులో కీళ్ల వాపుల్లో బోలెడు రకాలున్నాయి…

***ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌–కీలు అరిగిపోవటం వల్ల రావచ్చు.ఇప్పుడు ఎక్కువ మంది అనుభవిస్తున్న మోకాళ్ల నొప్పుల బాధ.

***ఇన్ఫెక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌–ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్‌ తలెత్తి అది కీలుకు చేరటం వల్ల కీళ్లనొప్పి రావచ్చు. దీన్ని ఇన్ఫెక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.

***సొరియాటిక్‌ ఆర్త్థ్రెటిస్‌–సొరియాసిస్‌ వంటి చర్మ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపు, నొప్పి పలకరించవచ్చు. దాన్ని సొరియాటిక్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.

***రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌—మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా కీళ్ల వాపు రావచ్చు.దాన్ని రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.

***వైరల్‌ రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌—చికున్‌గన్యా వంటి వైరల్‌ వ్యాధుల్లో కూడా కీళ్ల వాపులు రావచ్చు, వీటిని వైరల్‌ రియాక్టివ్‌ ఆర్త్థ్రెటిస్‌ అంటారు.

***రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌! కీళ్లవాతం–స్పష్టమైన కారణమేదీ తెలియకుండానే ఆరంభమయ్యే అతి పెద్ద కీళ్ల నొప్పులు సమస్య.

రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్(కీళ్లవాతం) ఇది ఎవరికి, ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణం తెలియదు. కానీ ప్రతి వంద మందిలో ఒకరిని వేధిస్తోంది.కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. తీవ్రమైన నొప్పితో జీవితం ఇబ్బందిగా అవుతుంది దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలూ ప్రభావితమై పరిస్థితి మరింత విషమిస్తుంది. అదృష్టవశాత్తూ దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చి.. తిరిగి హాయిగా జీవితం గడిపేలా తోడ్పాటునిచ్చే అత్యాధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది దీన్నే ఇమ్యూనిటీ అంటారు అదే తెలుగులో పేరు ‘రోగ నిరోధక వ్యవస్థ’. మనం వ్యాధుల బారినపడకుండా.. ఎటువంటి సూక్ష్మక్రిములూ మనపై దాడి చెయ్యకుండా నిరంతరం పహారా కాస్తుందీ వ్యవస్థ. ఇదిఒక్కోసారి కాంఫుసే ఐ మనమీదే దాడి చేస్తుంది దీని ఫలితమే ‘ఆటో ఇమ్యూన్‌’ సమస్యలు. కీళ్లవాతం.. రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ కూడా ఈకారణము వల్లనే వస్తుంది.

***రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ విషయంలో రక్త పరీక్షల వంటివాటి కంటే కూడా వైద్యుల విచక్షణకే ప్రాధాన్యత ఎక్కువ. లక్షణాల తీరు, కొన్ని పరీక్షల సహాయంతో వైద్యులే కచ్చితంగా నిర్ధారిస్తారు.

*** రక్తపరీక్ష: రక్తంలో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ (ఆర్‌ఏ ఫ్యాక్టర్‌) ఎలా ఉందో చూస్తారు. ఆరంభ దశలో ఇది 75% మందిలో పాజిటివ్‌గా ఉంటుంది. నెగిటివ్‌గా వచ్చినవారికి కొన్నాళ్ల తర్వాత మళ్లీ రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.

*** సీసీపీ యాంటీబాడీస్‌: వ్యాధి లక్షణాలు స్పష్టంగానే కనబడుతున్నా రక్తంలో ‘ఆర్‌ఏ ఫ్యాక్టర్‌’ నెగిటివ్‌ ఉన్న వారికి ఈ పరీక్ష అవసరం. ఇది పాజిటివ్‌ వస్తే కీళ్లవాతం ఉన్నట్టు బలంగా భావించాల్సి ఉంటుంది.

*** ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ: ఇవి కీళ్లవాతం బాధితుల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. హెమోగ్లోబిన్‌ తక్కువ ఉండొచ్చు.

*** వీటికి తోడు వాచిన కీళ్లకు ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ వంటివీ వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి.

***కీళ్లవాతానికి చికిత్స లేదని, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధలు పడాల్సిందేనని చాలామంది అపోహపడుతున్నారు. కానీ దీనికి సమర్థమైన చికిత్స ఉంది. దీనికి ఇచ్చే మందులను నాలుగు రకాలుగా విభజించొచ్చు.

***నొప్పి నివారిణి మందులు: ‘నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ రకం నొప్పి నివారణ మందుల్లో బ్రూఫెన్‌, నేప్రోసిన్‌, నిముసులైడ్‌, ఓవరాన్‌ వంటివి కొంచెం ఎక్కువ ప్రభావంతో పనిచేస్తాయి. ప్యారాసిటమాల్‌, ట్రెమడాల్‌ వంటివి తక్కువ ప్రభావం గలవి. వీటిని ముందుగా సిఫార్సు చేస్తారు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు.

** కార్టికో స్టిరాయిడ్స్‌: ఇవి నొప్పి తీవ్రతను తగ్గించటంలో బాగా తోడ్పడతాయి. వీటిని చాలా పరిమిత కాలానికే (అంటే కీళ్లవాతం తగ్గేందుకు ఇచ్చే దీర్ఘకాలిక మందుల ప్రభావం మొదలయ్యే వరకూ) ఇస్తారు. ఎక్కువ రోజులు వాడితే వీటితో దుష్ప్రభావాలుంటాయి గనక వీటిని తక్కువ మోతాదులో రెండు మూణ్నెల్లు మాత్రమే సిఫార్సు చేస్తారు.

***సాధారణంగా ఇతరత్రా కీళ్ల నొప్పులైతే శరీరంలోని ఏదో ఒకవైపు కీలుకు మాత్రమే వస్తాయి. కానీ రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌లో- ఒకేసారి రెండు వైపులా వాపు కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు కుడి చేతి వేలి కీళ్లు వాస్తే, ఎడమచేతి వేలి కీళ్లు కూడా వాస్తుంటాయి. కుడి మణికట్టు కీలు వాస్తే, ఎడమ మణికట్టు కీలూ వాస్తుంది. అలాగే ఈ వాపు ఏకకాలంలో శరీరంలోని చాలా కీళ్లకూ రావచ్చు.

*** కీళ్లవాతం ఏ వయసు వారికైనా రావచ్చుగానీ సాధారణంగా పెద్దవారిలోనే.. అదీ 30-60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా- ఇది మహిళల్లో ఎక్కువ. ప్రతి నలుగురు కీళ్లవాతం బాధితుల్లో ముగ్గురు మహిళలే ఉంటున్నారు.

*** కీళ్లవాతం.. సాధారణంగా శరీరంలోని చిన్న కీళ్లతో మొదలవుతుంది.అంటే చేతివేళ్లు, మణికట్టు, కాలివేళ్ల వంటి వాటితో ఆరంభమై క్రమేపీమోకాలు, తుంటి వంటి పెద్ద జాయింట్లకూ రావచ్చు. వాపు, నొప్పి వంటివన్నీ చిన్న జాయింట్లతో ఆరంభం కావటం దీని ప్రత్యేక లక్షణం. (అదే కీళ్లు అరిగిపోవటం వల్ల వచ్చే ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌ సాధారణంగా మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లతో మొదలవుతుంది)

*** కీళ్లవాతం కొంతకాలం ఉద్ధృతంగా ఊపేస్తుంది. బాధలు తీవ్రతరమవుతాయి. మరికొంత కాలం నెమ్మదిస్తుంది. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. మధుమేహం, హైబీపీల్లాగా ఇదీ దీర్ఘకాలిక సమస్య, దీనికి చికిత్స కూడా దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది.

*** కీళ్లవాతంలో ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోతుంటాయి. ఇలా కనీసం గంటకు పైగా బాధపడాల్సి ఉంటుంది. మిగతా కీళ్ల నొప్పులకూ, రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌కూ ఇదే ప్రధానమైన తేడా. అలాగే వీరిలో రాత్రి నొప్పులూ ఎక్కువ. కదులుతూ కాస్త అటూఇటూ తిరుగుతుంటే నొప్పి తగ్గినట్టుంటుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి, బాధ ఎక్కువ అవుతాయి.విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది.

* వ్యాయామం కీలకం కీళ్లవాతం బాధితుల్లో చాలామంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. కొన్నిసార్లు ఆపరేషన్‌ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. బాధలు ఉద్ధృతంగా ఉన్న సమయంలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మందులతో నొప్పి తగ్గాక వ్యాయామం మొదలెట్టాలి. నొప్పి తగ్గుతున్న కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని కూడా పెంచుకోవాలి. ఏరోబిక్‌, యోగా, నడక వంటి వ్యాయామాలు ఏవైనా చేయొచ్చు. బరువులు ఎత్తటం మాత్రం చేయకూడదు.

***రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ బాధితుల్లో చాలా కొద్దిమందికి మాత్రమే కీళ్ల మార్పిడి అవసరమవుతుంది. వ్యాధిని సత్వరమే గుర్తించి చికిత్స ఆరంభిస్తే ఈ కీళ్ల మార్పిడి అవసరం అంతగా రాదు. చిన్న కీళ్లకు ఈ మార్పిడి అవకాశమూ ఉండదు. అందుకే మందులతో చికిత్సకే ప్రాధాన్యం ఇస్తారు.

* జాయింట్లు ఎర్రగా వాచిపోయి నొప్పి

* ముట్టుకుని చూస్తే వేడిగా ఉండటం

* కీలు కదలికలు కష్టంగా తయారవటం

* ఉదయం లేస్తూనే కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండటం

* ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకే తీరులో కాకుండా పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు.

* చాలామందిలో రక్తహీనత

* ఆకలి సరిగా లేకపోవటం

* నిస్సత్తువ, బరువు తగ్గిపోతుండటం

* బాధలు ఉద్ధృతంగా ఉన్నప్పుడు కొద్దిపాటి జ్వరం

* మోచేయి, మణికట్టు ప్రాంతంలో చిన్న బుడిపెలు (రుమటాయిడ్‌ నాడ్యూల్స్‌) ఉండొచ్చు. ఇవి ఉన్న వారిలో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

* ఎక్కువ కీళ్లు వాచటం, రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావటం, నొప్పి.. ఈ లక్షణాలు 6 వారాల కన్నా ఎక్కువకాలం ఉంటే దాన్ని కీళ్లవాతం అని అనుమానించాలి.

*** కీళ్లవాతం వచ్చిన తొలిదశలో కీళ్ల మీది పైపొర మాత్రమే దెబ్బతింటుంది. వ్యాధి ముదురుతున్నకొద్దీ క్రమేపీ అది కీళ్లను, లోపలి ఎముకలను కొరికేస్తుంది. ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి వస్తుంది. కొన్నాళ్లకు కీళ్లు మొత్తం దెబ్బతింటాయి.

***రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులు ముంచుకొచ్చే అవకాశమూ ఎక్కువే. కీళ్లవాతాన్ని సరిగా నియంత్రించుకోకపోతే- వీరిలో గుండె జబ్బులు, పక్షవాతం వంటివి పదేళ్ల ముందుగానే వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు పొడిబారటం, లాలాజలం తగ్గిపోవటంతో పాటు గుండె చుట్టూ, వూపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులూ ఎదురవ్వచ్చు

***వ్యాధి ఉద్ధృతంగా ఉన్నప్పుడే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాధి ఉద్ధృతి తగ్గితే ఇతరత్రా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం పెద్దగా ఉండదు. అందుకే వీడకుండా చికిత్స, క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం..బెటర్

Most Popular

FMIM Ad