డబ్బున్న తండ్రులూ..ఆయన్ని చూసి నేర్చుకోండి

0
776

rich father poor son
ఆ కుర్రాడి పేరే డబ్బు ..అదేలేండి ..ద్రవ్య ..వెరైటీగా ఉంది కదూ ..కొడుకు పేరులోనే డబ్బు పెట్టిన ఆ తండ్రి నిజంగానే కోటీశ్వరుడు .వజ్రాల వ్యాపారి .సూరత్ లో హరేరామ డైమండ్ ఎక్సపోర్ట్ అధిపతి సాప్జీ దొలాకియా ..ఆ తండ్రి కొడుక్కి ఆస్తుల కన్నా ముందు కష్టాలు పరిచయం చేయదలుచుకున్నాడు .ఓయ్ ..నా పేరు ,డబ్బు ఏమి వాడుకోకుండా ఓ నెల బతికి చూపమని కొడుక్కి సవాల్ విసిరాడు .అతనూ తండ్రికి తగ్గ కొడుకే ..ఆ సవాల్ స్వీకరించాడు.

తన గురించి ఏమీ తెలియని కేరళ వెళ్ళాడు ..అక్కడి భాష కూడా తెలియదు .చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పొట్ట పోసుకున్నాడు .పెద్ద పెద్ద అనుభవాల్ని, జీవిత పాఠాల్నినేర్చుకున్నాడు ..ఉద్యోగం రాకపోతే పడే కష్టం ఏంటో స్వయంగా తెలుసుకున్నాడు ..మొత్తానికి తనకు ఆవల వుండే సరికొత్త ప్రపంచాన్ని దగ్గరా చూశాడు…కాదు ..కాదు ..అనుభవించాడు ..సెహబాష్ ద్రవ్య .

ఈ తండ్రీకొడుకులు ఈ తరానికి కొత్త పాఠం నేర్పారు ..చూశారా..డబ్బున్న తల్లితండ్రులూ?పిల్లలకి ఏమి ఇవ్వాలో మీరూ నేర్చుకోండి ..కాదనుకుంటే ..ఆ ఫలితాన్ని అనుభవించేది కూడా మీరే ..

Leave a Reply