ఒలింపిక్స్ లో ఇక బ్యాడ్మింటన్ వంతు

207

  rio olympics  badmintan saina nehwal pv sindhu

రియోలో  పూర్  పెర్ఫామెన్స్ కంటిన్యూ చేస్తోంది భారత్. ఒక్కొక్కరుగా  ప్లేయర్స్ ఇంటి దారి పడుతున్నారు.  గేమ్స్  ప్రారంభమై  ఐదు రోజులైనా… ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా రాలేదు. వెయిట్  లిఫ్టింగ్ లో సతీష్ , జూడోలో అవతార్  సింగ్ లు ఇంటిముఖం పట్టారు. అయితే ఆర్చరీలో బాంబేలా దేవి, బాక్సింగ్ లో వికాస్  కృష్ణన్ లు అదిరే ప్రదర్శనతో  ప్రిక్వార్టర్స్ లో అడుగుపెట్టి భారత్ లో ఆశలు నిలిపారు.  పతకాలు  సాధించే అవకాశమున్న సైనా నెహ్వాల్ , పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తో సహా భారత బ్యాడ్మింటన్  క్రీడాకారులంతా  ఇవాళ గ్రూపు మ్యాచ్ ల్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

రియో ఒలింపిక్స్ షూటింగ్ లో జీతు రాయ్  రెండో ఈవెంట్లోనూ విఫలమై ఒలింపిక్స్  నుంచి ఔటయ్యాడు. 10మీ ఎయిర్  పిస్టల్  ఈవెంట్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన జీతు.. 50మీ పిస్టల్  ఈవెంట్లో ఫైనల్ కు కూడా చేరలేకపోయాడు. 600 పాయింట్లకు 554 సాధించి, 12వ స్థానంతో క్వాలిఫికేషన్  దశలోనే వెనుదిరిగాడు. ఇదే ఈవెంట్లో ప్రకాశ్  నంజప్ప 25వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.మహిళల వ్యక్తిగత రికర్వ్  ఆర్చరీలో బాంబేలా అదరగొట్టింది. రెండో రౌండ్లో బాంబేలా 6-2తో ప్రపంచకప్  రజత పతక విజేత చైనీస్  తైపీ ప్లేయర్ లిన్  షి చిపై విజయం సాధించింది.

ఇవాళ బాంబేలా ప్రి క్వార్టర్ ఫైనల్  ఆడుతుంది.జూడో బరిలో ఉన్న ఏకైక భారతీయుడు అవతార్  సింగ్  ఇంటిముఖం పట్టాడు. పురుషుల 90కేజీ తొలి రౌండ్లో అతడు 2-1తో శరణార్థుల జట్టుకు చెందిన పిపోల్  మిసెంగా చేతిలో ఓడిపోయాడు.వెయిట్  లిఫ్టింగ్ లో భారత్  కథ ముగిసింది. పురుషుల 77కేజీ గ్రూప్ -బిలో శివలింగం సతీష్  కుమార్  నాలుగో స్థానంలో నిలిచాడు. స్నాచ్ లో 148కేజీ, క్లీన్  అండ్  జెర్క్ లో 181 కేజీలతో మొత్తం 329 కిలోలు ఎత్తాడు.బాక్సింగ్ లో భారత్  శుభారంభం చేసింది. పెద్దగా కష్టపడకుండానే వికాస్  కృష్ణన్  ప్రిక్వార్టర్స్  చేరుకున్నాడు.

75 కేజీల విభాగం తొలి రౌండ్లో వికాస్ .. 3-0తో అమెరికా కుర్రాడు చార్లెస్  కొన్ వెల్ ను ఓడించాడు. తొలి రౌండ్  నుంచే వికాస్  ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. మూడో రౌండ్లో కొన్ వెల్  పుంజుకుని కొన్ని పంచ్ లు విసిరినా.. అప్పటికే వికాస్ దే పైచేయిగా నిలిచింది.రియోలో భారత బ్యాడ్మింటన్  క్రీడాకారులు తొలి పోరుకు సిద్ధమయ్యారు. పతకాలు సాధించే అవకాశమున్న సైనా నెహ్వాల్ , పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తో సహా భారత క్రీడాకారులంతా ఇవాళ గ్రూపు మ్యాచ్ ల్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here