ఒలింపిక్స్ లో మెరుపు అందాలు..

0
1125

 rio olympics beauty

రియా ఒలింపిక్స్  సంబరం షురూ అయ్యింది. గేమ్ తో పాటు తమ అందచందాలతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు బ్యూటీ ప్లేయర్స్ రెడీ అయ్యారు. మిస్సీ ఫ్రాంక్లీన్.. అమెరికాకు చెందిన ఈ జలకన్య బరిలో ఉందంటే చాలు… స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొత్తం కిక్కిరిసి పోవాల్సిందే. లండన్ ఒలంపిక్స్ లో ఏకంగా 4 గోల్డ్ మెడల్స్, ఒక బ్రౌంజ్ మెడల్ సాధించడంతో పాటు.. ఇటీవల అమెరికాలో జరిగిన 100మీటర్స్, 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్ లలో వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ స్విమ్మింగ్ బ్యూటీ. కెనడాలో పుట్టిన ఈ 21ఏళ్ల మిస్సీ.. రియోలోనూ.. సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

2004, ఎథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్ ఒలంపిక్స్ లలో వరుసగా మూడు స్వర్ణాలు సాధించిన అమెరికన్ బీచ్ వాలీబాల్ ప్లేయర్ కెర్రీ వాల్ష్ జెన్నింగ్స్… రియోలోను గోల్డ్ మెడల్ పై కన్నేసింది. సిక్స్ ఫీట్ సన్ షైన్ గా 37 ఏళ్ల  అందాల ముద్దుగుమ్మను చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. ఆటతో పాటు తన పర్సనాలిటితో ఫ్యాన్స్ కు కైపెక్కిస్తానంటోంది.స్విమ్మింగ్ లో మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి సై అంటోంది 20 ఏళ్ల  చైనా బ్యూటీ షివెన్ యె. 16 ఏళ్లకే లండన్ ఒలంపిక్స్ లో 200, 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్ లో సత్తా చాటింది. న్యూ ఒలంపిక్, వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసి 2 గోల్డ్ మెడల్స్ సాధించిన వావ్ అనిపించింది.

ఇక ఆట, అందం రెండూ కలగలిపిన ప్లేయర్స్ కు భారత్ లోనూ కొదవ లేదు. టెన్నీస్ బ్యూటీ సానియా మీర్జా, ఫైర్ బ్రాండ్ గా పిలువబడే బ్యాడ్మింటన్ ఫ్రెండ్లీ స్టార్ గుత్తా జ్వాల, లుథియానాకు చెందిన 26ఏళ్ల  షూటర్ హీనా సిధ్దూలు…. అద్భుతమైన ఆటతో పాటు తమ అందచందాలతో అందరి మనుసూ దోచుకున్నవారే. ఇప్పటికే లండన్ ఒలంపిక్స్ లో బ్రౌంజ్ మెడల్ సాధించిన జ్వాలతో పాటు.. అందానికి బ్రాండ్ అంబాసిడర్ లు అయిన సానియా , హీనా సిధ్దులు రియో ఒలంపిక్స్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాకెట్స్ పట్టుకోవడం.. జల కన్యలా స్విమ్మింగ్ ఫూల్ లో దూసుకెళ్లడమే కాదు. ఆయా స్పోర్ట్స్ మ్యాగ్జిన్ ల కవర్ పేజ్ కోసం మేకప్ వేసుకొని…. కెమోరాల ముందు ఫోజులివ్వడానికి వెనకాడడం లేదు. ఆటకన్నా అందంతోనే పాపులరైన టెన్నీస్ ప్లేయర్ అనా ఇవనోవిచ్… స్విమ్ సూట్ లో ప్లేర్ మ్యాగ్జిన్ ఫోటో షూట్ లో పాల్గొని పెద్ద సంచలనమే రేపింది. వీరితో పాటు జిమ్నాస్టిక్స్ ప్లేయర్ మాడిసన్ కోకియాన్, టెన్నీస్ స్టార్ రద్వాన్ స్కా, విశ్వ క్రీడల్లో రెండోసారి బరిలోకి దిగుతున్న బ్రిటన్ అథ్లెట్ జెస్సికాలు ఆటతో పాటు…. అందంతోను ఆకట్టుకునేందుకు బరిలోకి దిగుతున్నారు.

Leave a Reply