రియోలో ప్రేక్షకుల కొరత…

0
582

  rio olympics  no audience

అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైన రియో ఒలింపిక్స్‌లో ప్రారంభ వేడుక‌లకు పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌లు ఆ త‌ర్వాత జ‌రుగుతున్న క్రీడ‌ల‌ను వీక్షించేందుకు రావ‌డం మానేశారు. దాదాపు 8 మిలియ‌న్ల టికెట్లు అమ్మిన‌ట్లు అధికారులు చెబుతున్న‌ప్ప‌టికీ.. క్రీడాప్రాంగ‌ణంలో ఖాళీ కుర్చీలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

జికా వైర‌స్ భ‌యంతో కొంద‌రు క్రీడ‌ల‌ను వీక్షించేందుకు దూర‌మ‌వుతుండ‌గా…మ‌రికొంద‌రు ఉగ్ర‌దాడులు జ‌రుగొచ్చేమోన‌నే భ‌యంతో స్టేడియంల‌కు రావ‌డం లేదు. దీంతో స్టేడియంలు ప్రేక్ష‌కులు లేక వెల‌వెల‌బోతున్నాయి.

Leave a Reply