రియో లో రిలయెన్స్ జియో ..జర్నలిస్టుల లైవ్ ..

0
607

  rio olympics reliance jio live telecast

4జీ ఆధునిక టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత అన్నింటా వేగం పుంజుకొంది. స్మార్ట్ ఫోన్లు వ‌చ్చినప్ప‌టి నుంచి టీవీ, మూవీ, మ్యూజిక్ అన్నీ ఒకే డివైస్ లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. దీనికి తోడు దేశంలో 4జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. తాజాగా రియో ఒలింపిక్స్ లో జ‌ర్న‌లిస్టులు 4జీ నెట్ వ‌ర్క్ తో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక్కడే కాదు. అటు ప్రధాని మోడీ అమెరికా ప‌ర్యట‌నలో ఉన్నప్పుడు ఐఫోన్ నుంచి లైవ్ టెలికాస్ట్ చేసింది బీబీసీ.

మీ ద‌గ్గ‌ర ఎల్టీఈ మొబైల్ ఉంటే ప్ర‌పంచం మీ చేతుల్లో ఉంటుంది. 4జీ కే ఇంత వేగం ఉంటే ఇక 5జీ, 6జీ లు వ‌స్తే ఇంకెంత స్పీడు ఉంటుందో చూడాలి మ‌రి.మరోవైపు రిల‌య‌న్స్ కంపెనీ  జియో పేరుతో సిమ్, హ్యాండ్ సెట్స్ మార్కెట్ లోకి తెచ్చింది. ఇవాళ జియో 4జీ నెట్ వ‌ర్క్స్ రిలీజ్ చేసింది రిలయన్స్. మూడు నెల‌ల‌ పాటు ట్రయల్ ఆఫ‌ర్స్ అందిస్తోంది. 2జీ, 3జీ సేవ‌ల‌తో జ‌నం విసిగి పోతున్నారు.

దేశంలో ప్ర‌తి ఒక్క‌రు మొబైల్ వాడుతుండ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి నెట్ వ‌ర్క్ లు అందించే స్పీడు పై ప‌డింది. ఫోర్ జీ సేవలు మరింత విస్తృత పరిచేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. ఏ కంపెనీ ఎక్కువ వేగ‌వంత‌మైన సేవ‌లు అందిస్తుందో అటు షిఫ్ట్ అవ్వడానికి జనం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply