రియో ఒలింపిక్స్‌ స్టార్ట్ …

rio-olympics-start

క్రీడా ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతి పెద్ద క్రీడాత్సవం 31వ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రెజిల్ నగరం రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ వేడులకను ప్రారంభించారు. బ్రెజిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. బ్రెజిల్ గర్వప్రదాత, ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. మొత్తం మూడున్నర గంటల పాటు ప్రారంభోత్సవ కార్యక్రమ జరిగింది.

ఎవల్యూషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బ్రెజిల్ పేరుతో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కళ్లు మిరమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు ఓ వైపు.. అథ్లెట్ల కవాతులు, అలరించే నృత్యాలు మరోవైపు.. వీటి మధ్య విశ్వ క్రీడా ఆరంభ వేడుకలు రియోలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున మారకానా స్టేడియంలో 31వ ఒలింపిక్స్‌ క్రీడా వేడుకలు ఆరంభమయ్యాయి. ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే ఒలింపిక్‌ జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించాడు.

మైదానంలో 6 వేల మంది కళాకారులు ప్రదర్శించిన వివిధ నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించిన అభినవ్‌ బింద్రా ఆరంభోత్సవంలో జాతీయ జెండాతో భారత బృందాన్ని నడిపించనున్నాడు. ఈసారి భారత్‌ నుంచి రికార్డు స్థాయిలో 118 మంది ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతున్నారు. ఒలింపిక్స్‌ చరిత్రలో భారత ఆటగాళ్ల సంఖ్య వంద దాటడం ఇదే తొలిసారి.ఆగస్టు 5న ప్రారంభమైన ఈ వేడుకలు 21 వరకు జరగనున్నాయి. మారకానా మైదానం సహా మొత్తం 37 వేదికల్లో పోటీలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here