రాహుల్ కి ఆమె షాక్ ఇచ్చింది..

 Posted October 20, 2016

rita bahuguna shocked rahul gandhi uttar pradesh
ఢిల్లీకి దగ్గరదారి యూపీ అని రాజకీయపండితులు చెపుతారు..అందుకే యూపీ ఎన్నికల్లో గౌరవం నిలుపుకుని హస్తిన గద్దె కోసం పోరాడాలని రాహుల్ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ ని ఢిల్లీ నుంచి దిగుమతి చేశారు.రాజ్ బబ్బర్ ను కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.భారీ ఆఫర్ ఇచ్చి ఒకప్పటి మోడీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కాంగ్రెస్ తరపున రంగంలోకి దించారు.యూపీ లో కాంగ్రెస్ పరిస్థితి తెలిసినా రాహుల్ ప్రయత్నాలు చూసిన కొందరు ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకున్నారు.కానీ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత సీన్ మారిపోయింది.

అమిత్ షా వ్యూహాలతో గట్టి పోటీదారుగా ఉన్న బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత యూపీ లో ఇంకా బలపడింది.అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఇంకా దిగజారింది. మళ్లీ సత్తువ కూడగట్టుకునేలోపే మాజీ పీసీసీ చీఫ్ రీటా బహుగుణ రాహుల్ కి షాక్ ఇస్తూ బీజేపీ లో చేరిపోయారు.ఎన్నికల సమయంలో తనని దూరంగా పెట్టడం పై రగిలిపోతున్న ఆమె అదను చూసి దెబ్బ గొట్టారు.రీటా సోదరుడు ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ సైతం ఆమెతో పాటు అమిత్ షా సమక్షంలో కమలంలో చేరిపోయారు.సర్జికల్ స్ట్రైక్స్ మీద రాహుల్ వ్యాఖ్యలు నచ్చక కాంగ్రెస్ ని వీడినట్టు చెప్పి షాక్ ఇచ్చారు.

SHARE