గురు కూడా పవన్ ని వాడుకున్నాడు..

 Posted March 31, 2017

Ritika Singh use pawan kalyan mannerism in venkatesh guru movieబాక్సింక్ కోచ్ పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వెంకటేష్, పవన్ నటించిన గోపాలగోపాల సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సారి కూడా పవన్ ని బాగా వాడేశాడు వెంకీ. అయితే డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా సినిమా మొత్తం లో కనీసం ఐదుసార్లు పవన్ కళ్యాణ్ మనకి కన్పిస్తాడు.

తమిళంలో హీరోయిన్ ధనుష్ ఫ్యాన్ అయితే.. తెలుగు లో పవన్ ఫ్యాన్. దీంతో  ఆమె మాట.. నడక అన్నింట్లోనూ పవన్ ప్రభావం ఉంటుంది. పవన్ మెడ మీద రుద్దుకునే మేనరిజం, హా హా అంటూ ఎగరేసి మాట్లాడే మేనరిజాలు కన్పిస్తాయి. ఇక గబ్బర్ సింగ్ కటౌట్లు, పోస్టర్లు  చాలాసార్లే కనిపిస్తాయి. గతంలో కూడా నితిన్.. గుండెజారి గల్లతయ్యిందే సినిమాలో ఇలానే పవన్ ని ఇమిటేట్ చేసి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు గురు సినిమాలో   పవన్ మేనరిజమ్స్ చూసిన అభిమానులు ధియేటర్లో ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని  చిన్న హీరోలే కాదు పెద్ద హీరోలు కూడా బాగానే వాడుతున్నారు.

SHARE