రీతు వర్మ లక్కీ ఛాన్స్..!

0
535

 

  ritu varma got lucky chance  act nikhil movie

పెళ్లిచూపులు హిట్ తో అందులో నటించిన కాస్టింగ్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే హీరో విజయ్ తన తర్వాత సినిమా కోసం దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటే ఇక అందులో హీరోయిన్ గా నటించిన రీతు వర్మ కూడా క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటుంది. ప్రస్తుతం కథా చర్చలు కొనసాగిస్తున్న రీతు వర్మ సుధీర్ వర్మ, నిఖిల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఛాన్స్ కొట్టేసింది. నిఖిల్ కెరియర్ లో స్వామిరారా హిట్ ఎంత బూస్టప్ ఇచ్చిందో తెలిసిందే. ఇక మొదటి సినిమాతోనే మెమరబుల్ హిట్ అందుకున్న సుధీర్ వర్మ ఆ తర్వాత నాగ చైతన్యతో చేసిన దోచేయ్ ఫ్లాప్ అవ్వడంతో కొద్దిపాటి గ్యాప్ తీసుకుని మళ్లీ నిఖిల్ తోనే సినిమాకు సిద్ధమయ్యాడు.

సో ఇంతటి క్రేజీ సినిమాలో రీతు అవకాశం దక్కించుకోవడం నిజంగా లక్కీ అని చెప్పాలి. పెళ్లిచూపులు ముందు ఎన్నో సినిమాల్లో కనిపించిన రీతు తనకు వచ్చిన సోలో అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ సినిమాలో రీతు పలికించిన అభినయం అందరికి అవాక్కయ్యేలా చేసింది. పెళ్లిచూపులు హిట్ ఆ సినిమాలో పనిచేసిన హీరో హీరోయిన్స్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా కెరియర్ లో మంచి కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Leave a Reply