Posted [relativedate]
GHMC పేదోడి కడుపు నింపడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 రూపాయలకు మధ్యాహ్న భోజనం కోసం ఓ ఊహించని అతిధి వచ్చాడు.చేతిలో హెల్మెట్ తో వరసలో నుంచుని 5 రూపాయల భోజనం చేసి వెళ్ళాడు.ఆయన ఎవరో తెలియని పక్క వాళ్ళు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.తెలిసిన వాళ్ళు మాత్రం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? ఏపీ రాజధాని ప్రాంతం మంగళగిరి ఎమ్మెల్యే.ఆళ్ళ రామకృష్ణారెడ్డి.అలియాస్ ఆర్కే .మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఓ వార్డ్ నుంచి వైసీపీ ని గెలిపించి టీడీపీ కి ,ఓటునోటు కేసులో సుప్రీమ్ తో నోటీస్ ఇప్పించి బాబుకి షాక్ ఇచ్చిన యువ ఎమ్మెల్యే. ఆయన బైక్ మీద రావడం,5 రూపాయల భోజనం చేయడం వెనుక కారణం ఏంటో మాత్రం తెలియరాలేదు.
రామకృష్ణారెడ్డి గురించి చెప్పుకోవాలంటే ముందుగా సిటీ లో రాంకీ టవర్స్ చూస్తే చాలు. రాంకీ అధినేత ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి సోదరుడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి.బసవతారకం కాన్సర్ హాస్పిటల్ దగ్గర వున్నా ghmc కౌంటర్ లో ఆర్కే భోజనం చేయడం సరదానా,లేక షుగర్ పేషంట్ కావడంతో ఆకలికి తట్టుకోలేక అలా పని కానిచ్చేసారో మరి ..