ఆర్కే కి న్యాయ శాఖ?

 Posted October 25, 2016

rk in act of lawఅధికార పక్ష నేతలకి మంత్రి పదవులు ఎలా ఇస్తారో..అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా తమ నేతలకి ఆయా శాఖల్లో తప్పొప్పులు వెదికి చూపే బాధ్యత అప్పగిస్తారు.షాడో క్యాబినెట్ ల పేరుతో ప్రతిపక్ష సభ్యులు ఆయా శాఖలపై ప్రత్యేక దృష్టి పెడతారు. కొన్ని దేశాల్లో వున్న ఈ సాంప్రదాయాన్ని చంద్రబాబు ప్రతిపక్షనేతగా వున్నప్పుడు కూడా ట్రై చేశారు.ఇప్పుడు జగన్ పైకి ప్రకటించకపోయినా ఓ ఎమ్మెల్యే కి న్యాయపరంగా బాబు సర్కార్ ని ముప్పుతిప్పలు పెట్టే బాధ్యత అప్పజెప్పినట్టుంది.అతను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.అలియాస్ ఆర్కే.మొదట్లో ఆయన్ను బాబు సర్కార్ కూడా లైట్ తీసుకుంది.వరసగా తగులుతున్న షాక్ లతో ఇదంతా ఓ పక్కా వ్యూహంతో జరుగుతున్న వ్యవహారంగా డిసైడ్ అయింది.

తొలుత ఓటుకునోటు కేసు వ్యవహారంలో బాబు మీద విచారణ వేగవంతం చేయాలంటూ ఏసీబీ కోర్టుని ఆశ్రయించి సక్సెస్ అయ్యారు ఆర్కే .హైకోర్టు లో స్టే వచ్చినా పక్కనపడిందనుకున్న అంశం మళ్లీ తెరమీదకి వచ్చింది.కొన్నాళ్ళు బాబుని ఇబ్బంది పెట్టింది.తరువాత సదావర్తిసత్రం భూముల వేలం కేసులోనూ కోర్టుని ఆశ్రయించి ఏపీ సర్కార్ కి షాక్ ఇచ్చారు ఆర్కే.ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ కి లా డిగ్రీ లేనందున అయన వున్న పదవికి అనర్హుడని మరోసారి కోర్టు మెట్లెక్కారు ఆర్కే.పదేపదే కోర్టు కేసులతో బాబు సర్కార్ చికాకుపడుతుంటే వైసీపీ సభ్యులు మాత్రం మాకు అధికారమొస్తే మా వాడికి న్యాయశాఖ గారెంటీ అని చెప్పుకుంటున్నారు.అదండీ ఆర్కేకి న్యాయశాఖ వ్యవహారం.

SHARE