బాప్రే..ఫస్ట్ లుక్ కే 6 కోట్లా..!

0
341
Robo 2.0 Pramotions 6 Crores Only For First Look

Posted [relativedate]

Robo 2.0 Pramotions 6 Crores Only For First Lookశంకర్, రజినికాంత్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ రోబో 2.0 మూవీ ప్రమోషన్స్ భారీ రేంజ్లో చేయాలని చూస్తున్నారు. కేవలం ఈ సినిమా ప్రమోషన్స్ కే దాదాపు 40 కోట్ల దాకా ఖర్చు పెట్టే ఆలోచనలో ఉన్నారట. అందులో భాగంగా ఈ నెల 20న రిలీజ్ చేయనున్న ఫాస్ట్ లుక్ పోస్టర్ కు 6 కోట్ల కర్చుతో ఈవెంట్ ప్లాన్ చేశారట. విజ్ క్రాఫ్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారు ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తుండగా కరణ్ జోహార్ ఈ వ్యవహారం చూస్తున్నారు.

ముంబైలోని యశ్ రాజ్ చోప్రా స్టూడియోలో ఈ ఈవెంట్ జరుగనుంది. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమమలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీస్తున్నాడు శంకర్. ఐ తర్వాత శంకర్ తీస్తున్న సినిమాగా అంచనాలను అదే రేంజ్లో అందుకునేలా సినిమా ఉంటుందట. కబాలి ప్రమోషన్స్ తోనే కెక పెట్టించిన రజిని ఈసారి ఇంకా ఎక్కువ శ్రద్ధతో రోబో ప్రమోషన్స్ చేయబోతున్నారట.

ఏమి జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమ్మర్ రిలీజ్ ప్లాన్ తో వస్తున్న ఈ సినిమాతో సౌత్ సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పాలని చూస్తున్నాడు శంకర్.

Leave a Reply