Tuesday, October 19, 2021
HomeEntertainmentCinema Latestస్పైడర్‌ ఏంటో తెలిసి పోయింది

స్పైడర్‌ ఏంటో తెలిసి పోయింది

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కుతున్న ‘స్పైడర్‌’ చిత్రం టీజర్‌ నిన్న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదల అవ్వాల్సి ఉంది. కాని దాసరి నారాయణ రావు చనిపోవడంతో విడుదల వాయిదా వేసి నేడు ఉదయం విడుదల చేయడం జరిగింది. నిమిషం నిడివితో విడుదలైన టీజర్‌ సినిమా ఏంటి, ఎలా ఉండబోతుంది అనే ఒక క్లారిటీని ఇచ్చింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న సమాచారం ప్రకారం హీరో మహేష్‌బాబు స్పై ఆపరేషన్స్‌ చేస్తూ ఉంటాడు. ఆ ఆపరేషన్‌ కోసం రోబో స్పైడర్‌ను వినియోగించుకుంటూ ఉంటాడు.

టీజర్‌లో డైలాగ్‌ కాని, యాక్షన్‌ కాని ఏమీ లేదు. కాని స్పైడర్‌ రోబోను చూపించి, మహేష్‌బాబు చిన్న లుక్‌ ఇవ్వడం చూస్తుంటే సినిమా ఎంత భారీగా, ఎంత విభిన్నంగా ఉంటుందో అర్థం అవుతుంది. స్పైడర్‌ టైటిల్‌ ఎందుకు పెట్టారో కూడా ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ సినిమాలో స్పైడర్‌ రోబో చాలా కీలకంగా ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మురుగదాస్‌ మార్క్‌తో ఈ సినిమా ఉంటుంది. 110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెలలో షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమా విడుదలపై కూడా యూనిట్‌ సభ్యులు  టీజర్‌లో క్లారిటీ ఇచ్చారు. దాసరాకు సినిమాను విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

- Advertisment -
spot_img

Most Popular