రిలీజైన రోగ్ ఫస్ట్ లుక్

Posted February 14, 2017

rogue first look releaseపూరీ జగన్నాధ్.. ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకుపోతూ టాప్  డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు. అయితే ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు. తాజాగా మరో సినిమాతో తన లక్ ను  పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాను  ఎలాగైనా హిట్ చేయాలన్న పట్టుదలతో తనకు  అచ్చొచ్చిన తిట్ల రూపంలో ఉన్న టైటిల్ నే ఈ  సినిమాకు కూడా ఎంచుకున్నాడు.

రోగ్ సినిమాతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నిర్మాత మనోహర్‌ కుమారుడు ఇషాన్‌ హీరోగా పరిచయం కానున్నాడు. కాగా ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా రోగ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రయూనిట్. తెలుగు, కన్నడలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ లో హీరో తలక్రిందులుగా వేలాడి ఉన్నాడు. అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రేమ కోసం దేనికైనా సిద్ధమే అనే విధంగా ఇషాన్‌ ను చూపించాడు పూరీ జగన్నాథ్‌. ఇక ‘మరో చంటిగాడి ప్రేమకథ’ అనే ట్యాగ్‌ లైన్‌ ఉండడంతో రోగ్… ఇడియట్‌  సినిమాను గుర్తు చేసింది. మరి రోగ్…  ఇడియట్ రేంజ్ ను అందుకుంటాడో  లేదో చూడాలి.

SHARE