విడుదలైన “రోగ్” ట్రైలర్

0
557

Posted [relativedate]

Rogue Theatrical Trailerడాషింగ్‌ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌ ఇటీవల వరుస పరాజయాలతో డీలీ పడిపోయాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలతన్న కసితో తెరకెక్కిస్తున్న చిత్రం రోగ్. మరో చంటిగాడి ప్రేమకథ అనే క్యాప్షన్ తో రానున్న ఈ చిత్రంతో  ఇషాన్  హీరోగా పరిచయమవుతున్నాడు. తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ విడుదలకానున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే రీలీజైన ఫస్ట్‌ లుక్‌, మోషన్ పోస్టర్ లు పూరీ టేకింగ్ పై అంచనాలను పెంచాయి. ఈ హైప్ ని అలానే కంటిన్యూ చేసేందుకు నిన్న హైద‌రాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్లో సినిమా ట్రైలర్ ను ఘనంగా విడుదల చేశారు.

ఐ హేట్ గర్ల్స్  అంటూ మొదలైన ఆ ట్రైలర్ లో హీరోహీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండేలా కేర్ తీసుకున్నాడు పూరీ. హీరోలను చూపించడంలో  పూరీ స్టైలే వేరు.  ఈ లవ్ ఎంటర్ టైనర్ లో కూడా ఇషాన్ ను అలాగే చూపించాడు పూరి. అలాగే తన మార్క్ డైలాగ్స్   ని కూడా వినిపించాడు.  మీ అమ్మాయిలకు ఇది కామనే కదా బకరా ఒకడు .. స్టాండ్ బై ఒకడు, ఆ పీస్ నాదిరా..ఇచ్చేయ్ ..దా, ఎవరైనా నా వెనుకాల దాక్కుంటే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తా.. అనే  పూరి డైలాగ్స్ అదరగొట్టాయి. మరి రోగ్ మరో ఇడియట్ అవుతాడో లేదో చూడాలి.

Leave a Reply