బాబుకి కొత్తపేరు పెట్టిన రోజా…

 Posted October 19, 2016

roja fires on chandrababu
ఎన్ని విమర్శలు ఎదురైనా ..ఎవరేమనుకున్నా ..రాజకీయ ప్రత్యర్థుల మీద సరికొత్త అస్త్రాలు ప్రయోగించడంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాని మించిన వాళ్ళు లేరు.తాజాగా ఆమె చంద్రబాబుకి ఓ కొత్త పేరు పెట్టారు.బాబు కరువుకు పాస్ వర్డ్ …అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ అని రోజా అభివర్ణించారు.మాటల్లో ఘాటు తగ్గించుకోమని జగన్ సహా వైసీపీ సభ్యులు చాలా మంది ఆమెకి సలహా ఇచ్చారట.అందుకే కాబోలు ఆమె ఈసారి కంప్యూటర్ పరిభాష వాడారు.అయినా ఆమె మాటలు ప్రత్యర్థికి హార్డ్ గానే తగులుతున్నాయి.రాజాకీయాల మాటేమోగానీ …రాజకీయ విమర్శల విషయంలో..ప్రత్యర్థుల మీద మాటల దాడి విషయంలో రోజా మాంచి కోచింగ్ సెంటర్ పెట్టేయొచ్చు.కాకపోతే అక్కడ తెల్లచొక్కాలకి సీట్లు దొరకడం సులభం కాదేమో

SHARE