ఆపరేషన్ జగన్ లో ఆ ముగ్గురు…300 కోట్లు?

0
584
roja says ganta srinivasa rao narayana and sidda raghava rao use 300 cr in mlc elections

Posted [relativedate]

roja says ganta srinivasa rao narayana and sidda raghava rao use 300 cr in mlc elections
మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. కడపలో తొలిసారి ఓటమి రుచి చేదుని భరించలేకపోతున్న ఆయనకి ఇంకో ఇబ్బంది ఎదురవుతోందట.అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయం కావడంతో సభ లోపల,బయట లాబీల్లో ఎదురు పడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు కడప ఫలితం గురించి అడుగుతున్నారట.ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా బయటపెట్టారు.జగన్ ని ఈ విధంగా ఎగతాళి చేసినందుకు భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరికొన్ని కీలక అంశాల్ని కూడా ప్రస్తావించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ని ఓడించేందుకు చంద్రబాబు అన్ని అక్రమ మార్గాలు తొక్కారని ఆమె ఆరోపించారు.ఆపరేషన్ జగన్ పేరిట మంత్రులు శిద్ధా,గంటా,నారాయణ మూడు జిల్లాల్లో అడ్డదారులతో విజయాన్ని సాధించి బాబుకి కానుకగా ఇచ్చారని ఆమె ధ్వజమెత్తారు.ఈ ముగ్గురు అక్రమాలతో పాటు ప్రజాప్రతినిధుల్ని కొనుగోలు చేసేందుకు దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.రోజా మాటలపై టీడీపీ తో పాటు కొందరు వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు.టీడీపీ నేతలు ఎవరైనా ఎగతాళిగా మాట్లాడినా అది బయటపెట్టి జగన్ కి ఇంకాస్త ఇబ్బంది తెచ్చిపెట్టడం తప్ప ప్రయాజనమేంటని వారు వాదిస్తున్నారు.

Leave a Reply