మళ్లీ గీత దాటిన రోజా..జబర్దస్త్ భాష

Posted October 14, 2016

  roja sensational comments on nara lokesh
అన్ని మాటలు అందరికీ వచ్చు..కాకపోతే ఏది ఎక్కడ మాట్లాడాలో తెలిస్తే ఆ మాటకి విలువ.మాట్లాడిన వారికి గౌరవం.ఇది తెలియకే అసెంబ్లీ లో వాడిన భాషకి వైసీపీ ఎమ్మెల్యే రోజా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.అయినా ఆమె నోటిదూకుడు తగ్గలేదు.అందుకు తాజాగా బాబు కుమారుడు లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడిన భాషే ఓ ఉదాహరణ.డిక్కీ బలిసిన డాష్,సిమ్ లేని సెల్ ఫోన్ …ఇవీ లోకేష్ గురించి ఆమె మాట్లాడిన మాటలు.రాజకీయ విమర్శలు చేయొచ్చు..కానీ జబర్దస్త్ భాష తెచ్చి ఇక్కడ వాడితే జనం నవ్వరు…నవ్విపోతారు.

రోజా కామెంట్స్ తో టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.ముఖ్యంగా లోకేష్ కి దగ్గరగా వుండే నేతల్లో కాక మొదలైంది.వారు కూడా అదే స్థాయిలో రోజాకి కౌంటర్ ఇస్తే ఏమవుతుంది? రాజకీయ విమర్శలు కూడా జబర్దస్త్ కార్యక్రమాన్ని తలపిస్తాయి..

SHARE