ముసలి సీఎం కి బికినీ,బీచ్ లా?

 Posted November 7, 2016

roja speach on chandrababu old cm with bikini and beach.roja on chandrababu,speach on chandrababu,roja speach,chandrababu beach abd bikni
తిట్టే నోరు ..కొట్టే చేయి ఆగబోవంటారు..అందుకేనేమో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి సీఎం చంద్రబాబుని టార్గెట్ చేసి పదునైన పదజాలం ప్రయోగించారు.విశాఖ లో ఆ పార్టీ జరిపిన జై ఆంధ్ర ప్రదేశ్ సభలో ఆమె మాటలు పరిధి దాటాయనిపిస్తోంది.సీఎం చంద్రబాబుని ఆమె ముసలి ముఖ్యమంత్రిగా అభివర్ణించారు.40 ఏళ్ల యువకుడైన జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే..40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న బాబు మాత్రం బికినీలు,బీచ్ లు,ప్రేమోత్సవాలు అని తిరుగుతున్నారని ఆమె మండిపడ్డారు.ఇలాంటి పనులు చేసే చేసేందుకు సిగ్గుండాలని కూడా రోజా వ్యాఖ్యానించారు.
లోకేష్ మీద కూడా రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కనీసం పార్టీ మండల కమిటీని ఎలా నియమిస్తారో తెలియని వ్యక్తిని ప్రధాన కార్యదర్శి ఎలా అవుతారని ఆమె నిలదీశారు.హోదా కోసం వైసీపీ ఎంపీలు సిద్ధంగా వున్నారని.దమ్ముంటే దేశం ఎంపీ లు కూడా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని రోజా సవాల్ విసిరారు.జంప్ జిలానీలైన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళితే ఎవరి సత్తా ఏమిటో అర్ధమవుతుందని ఆమె అన్నారు.ఏమైనా సీఎం మీద దుందుడుకు వ్యాఖ్యలతో మరోసారి రోజా సెన్సేషన్ అయ్యారు.దీనికి కౌంటర్ ఏ స్థాయిలో ఉంటుందో మరి..

SHARE