రోజా వర్సెస్ పోలీస్

0
142
roja use unparliamentary words on dgp sambasiva rao

Posted [relativedate]

roja use unparliamentary words on dgp sambasiva rao
మంచి వాగ్ధాటి ఉన్న నాయకురాలిగా రోజాకు గతంలో మంచి పేరుండేది. కానీ ఆమె ఏ క్షణంలో వైసీపీ ఎమ్మెల్యే అయిపోయిందో కానీ అప్పటి నుంచి విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. తన నోటి దురుసు వల్లే రోజాకు ఈ పరిస్థితి ఎదురవుతోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా ఆమె పోలీసులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసి.. వారి దగ్గర్నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు డీజీపీ సాంబశివరావు బానిసలా వ్యవహరిస్తున్నారంటూ రోజా కామెంట్ చేశారు. మామూలుగా రాజకీయ నాయకుల విమర్శలను లైట్ తీసుకునే పోలీసులు .. ఈ సారి మాత్రం స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రోజా వ్యాఖ్యలు చేసింది డీజీపీ గురించి కావడం.. అది కూడా కొంత శృతిమించడంతో పోలీసులు సీన్ లోకి వచ్చారు.

పోలీసులు ఎవరికీ బానిసలు కారని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేవలం చట్టానికి మాత్రమే బానిసలని తేల్చిచెప్పారాయన. అంతేకాదు రోజా వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు.

ఇక పోలీసు అధికారుల నుంచి ఊహించని రియాక్షన్ రావడంతో రోజా కూడా ఖంగు తిన్నారని టాక్. నిజంగానే పోలీసుల గురించి తాను శృతిమించి మాట్లాడానా ..? అని ఆమె సన్నిహితులతో చెప్పారట. అయితే ఇప్పుడు క్షమాపణలు చెబితే.. తాను వెనక్కు తగ్గినట్టవుతుంది కాబట్టి.. సారీ చెప్పడంపై డైలామాలోనే ఉన్నారని టాక్.

ఒకదశలో సారీ చెప్పడానికి కూడా రోజా సిద్ధమైపోయారట. అయితే వైసీపీ పెద్దలు మాత్రం అలాంటివి చేయొద్దని గట్టిగా చెప్పారట. దీంతో రోజా- పోలీస్ వార్ అలాగే కంటిన్యూ అవుతోంది. ఈ డైలాగ్ వార్ కు సారీతో ఫుల్ స్టాప్ పడుతుందనకుంటే.. మరింత సాగుతోంది. ఇది ఎక్క‌డిదాకా వెళ్తుందో చూడాలి!!

Leave a Reply