రోజా నోట ఆ మాటొచ్చింది ..

  roja wrote sorry letter ap assembly speaker
అసెంబ్లీ లో …బయట సభల్లో ..ఎప్పుడైనా ఎక్కడైనా …ఆమె నోరు తెరిస్తే రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో మరఫిరంగులు పేలతాయి.ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.టీడీపీ లోవున్నప్పుడు ఆ మాటే ఆమెకి ఆయుధమైంది.అవకాశాలు తెచ్చిపెట్టింది.కానీ 2016 తర్వాత ఆ దూకుడే ఆమె కి నానా తిప్పలు రాడానికి కారణమైంది.అసెంబ్లీ లో సాటి మహిళా ఎమ్మెల్యే మీద నోరుజారిన రోజా ఏడాదిపాటు సస్పెండ్ అయినా సభ కోరిన సారీ మాత్రం చెప్పలేదు.సస్పెన్షన్ ఎత్తివేయమని సుప్రీమ్ కోర్ట్ దాకా వెళ్లినా ఫలితం లేకపోయింది.చివరికి సారీ చెప్పాల్సి వచ్చింది.ఆమె సభకి,మహిళా సభ్యురాలికి క్షమాపణ చెబుతూ రాసిన లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరింది.ఈ పని ఎప్పుడో చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు.

మొత్తానికి రోజా వ్యవహారం చూస్తుంటే ఓ పాత సామెత గుర్తొస్తోంది.మేళతాళాలతో పెళ్ళికి పిలిస్తే వెళ్లకుండా …వెనుక తలుపు దగ్గరకెళ్ళి కొద్దిగా చారు పోయామన్నట్టుంది.ఆ సారీ చెబితే చాలని అధికార పక్షంతో పాటు సొంత పార్టీ వాళ్ళు ఎంత చెప్పినా ఆమె చెవికెక్కలేదు.ఇప్పుడు ఎవరు అడక్కుండానే తనకు తానే క్షమాపణ లేఖ రాయాల్సి వచ్చింది.

SHARE