రోజులు మారాయి –  కంప్లీట్ రివ్యూ

199

 rojulu marayi movie review

రోజులు మారాయి – రివ్యూ

Rating : 2.75/5

నటులు : తేజస్వి మదివాడ, కృతిక, చరణ్ మద్దినేని, పార్వతీశం, రాజా  రవీంద్ర, పోసాని కృష్ణ మురళి

డైరెక్టర్ : మురళి కృష్ణ

మ్యూజిక్ : జేబి

నిర్మాత : జి శ్రీనివాస్ రావు

సమర్పించు వారు : దిల్ రాజు

బ్యానర్ : మారుతీ టాకీస్, గుడ్ సినిమా గ్రూప్

ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా జోరుగా సాగుతుంది. సినిమాలో విషయం  వుంటే చాలు బాక్సాపీస్ ను శాసిస్తున్నాయి. ఈ కోవ లోనే ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా రోజులు మారాయి. వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ఈ రోజులు మారాయి.  చరణ్ మద్దినేని,  పార్వతీశం, కృతిక, తేజస్వి ప్రధాన పాత్రల్లో మురళీ కృష్ణ  ముడిదానిని దర్శకునిగా పరిచయం చేస్తూ వచ్చిన, ఈ సినిమా ఏ మేర ఆడియన్స్ ను ఆకట్టుకుందో చూద్దాం…

కథ

ఆధునిక భావాలు, స్వతంత్రంగా జీవించాలనే తలపు వున్న నలుగురి టీనేజర్స్ కథ  ఈ సినిమా.ఇంకా విపులం గా చెప్పాలి అంటే అమాయకులైన ఇద్దరు అబ్బాయిలు ,తెలివైన ఇద్దరు గడుసమ్మాయిల మధ్య  నడిచే  కథే  రోజులు మారాయి.రంభ, ఆద్య అనే ఇద్దరమ్మాయిలు లైఫ్ ని లగ్జరిగా గడపాలి అనుకుంటారు.అందుకు తగ్గట్టుగానే మంచి ఆస్తి ఉన్న వారిని పెళ్లి చేసుకొని ఇతర దేశాలలో సెటిల్ అవ్వాలని అనుకుంటుంటారు.ఇద్దరు డబ్బున్న అబ్బాయిలను ఎన్నుకుంటారు.ఈ ప్రక్రియ లో వారిని పడేయటానికి ఓ సాధువును కలుస్తారు.ఆ సాధువు పెళ్లైన వెంటనే వీరి భర్తలు చనిపోతారు అని చెప్తాడు.దాంతో ఈ ఇద్దరమ్మాయిలు హీరోలను పావులుగా వాడుకోవాలి అనుకుంటారు. వారిని పిచ్చిగా  ప్రేమించే పీటర్ అశ్విత్ లను పెళ్లిచేసుకుంటారు.మరి సాధువు చెప్పినట్టు పీటర్ అశ్విత్ లు చనిపోతారా.?ఈ అమ్మాయిల కథ  ఏ మలుపు తిరుగుతుంది..? వీరు కోరుకున్నట్టు డబ్బున్న అబ్బాయిలతో పెళ్లి అవుతుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం వెండి తెర పైనే చూడాలి

నటీనటుల ప్రతిభ

యూత్ ఫుల్ లవ్ స్టోరి గా వచ్చిన ఈ సినిమాలో అప్ కమింగ్ యాక్టర్స్ అయినా  అందరు తమ పరిధి మేర బాగా నటించారు.ముందుగా చెప్పుకోవలసినది చేతన్ గురించి. తన పాత్రలో చాలా సహజంగా నటించాడు. తన ప్రేయసి మోసం చేస్తుందని తెలిసినా పిచ్చిగా ప్రేమించే లవర్ గా తన పాత్రలో జీవించాడు.అశ్విత్ కూడ తన రోల్ కు తగ్గట్టుగా మంచి ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. ఎప్పటిలాగే తేజశ్వీ తన బబ్లీ లుక్స్ తో ఆకట్టుకుంది. కృతిక కూడా  తన నటనతో మెప్పించింది.నటనకు కొత్త అయినా  నటించటం లో మంచి నైపుణ్యం ప్రదర్శించారు .

సాంకేతిక విలువలు

 యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్ అందించటం లో మారుతిది ప్రత్యేక శైలి.కథ, స్క్రీన్ ప్లే మారుతి అందించటం తో రోజులు మారాయి సినిమాకి మంచి హైప్ వచ్చింది.కానీ మారుతి  పాత రోటిన్ కథ తో ఆడియన్స్ ను  నిరాశ పరిచాడు అనే చెప్పాలి. తమ లాభం కోసం ప్రేమ ను వాడుకోవటం,అవసరం తీరాక వదిలేయటం చాలా రోటిన్ కథ.కాకపోతే స్క్రీన్ ప్లే తో కొంతలో కొంత కవర్ చేయగలిగాడు దర్శకుడు. కాని సినిమాను మాత్రం వినోదాత్మకంగా చూపించలేక పోయాడు.కొన్ని సీన్లు మరీ  ఇబ్బంది పెడతాయి.సెకెండ్ హాఫ్ కూడా బోరింగ్ గా అనిపిస్తుంది. . జేబి అందించిన సంగీతం ఫరవాలేదు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగానే వున్నా కథను బాగా నడిపించలేక పోయాడు డైరెక్టర్ మురళీ కృష్ణ. . ముఖ్యంగా సినిమా రెండవ భాగం. సినిమా టైటిల్ కి సినిమాకు సంబంధం లేనట్టు అనిపిస్తుంది.

మంచి

స్క్రీన్ ప్లే

నటన

నిర్మాణ విలువలు

చెడు

కథ

కొన్ని సన్నివేశాలు

కామెడి ట్రాక్

సెకెండ్ హాఫ్

విశ్లేషణ

మారుతి స్టయిల్ సినిమా గా ఎన్నో అంచనాలతో వచ్చి, ఆడియన్స్ ని కొంచెం  నిరాశ పరిచిన సినిమా ఈ రోజులు మారాయి.పాత చింతకాయ పచ్చడి లాంటి కథ  కావటం,కామెడి ట్రాక్ అంతగా ఆకట్టుకోలేక పోవటం,కథ  మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే చెప్పేయటం.. సెకెండ్ హాఫ్ లో చూపించటానికి ఏం లేకపోవటం తో ఆడియన్స్ కి సినిమా బోర్ కొట్టే అవకాశం వుంది.యాక్టింగ్ టైమింగ్ సూపర్ గా వున్న ఈ మూవీని ఓ సారి ట్రై చేయవచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here