Wednesday, December 8, 2021
Homelatestరూల్స్ జనానికే.. మాక్కాదు

రూల్స్ జనానికే.. మాక్కాదు

 

అందరికీ రూల్స్ పాటించాలని చెబుతాం.. కానీ మేమెందుకు పాటిస్తాం అంటున్నారు ఖాకీలు. ఏపీలో హోంగార్డుపై పోలీసుల ప్రవర్తన చర్చనీయాంశమైంది. చివరకు జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాల్సినంతగా పరిస్థితి దిగజారింది. కేవలం ట్రాఫిక్ రూల్స్ ఫాలో కమ్మని చెప్పినందుకు పోలీసులకు అంత కోపం వచ్చేసింది.

రాయలసీమ ముఖద్వారం కర్నూల్లో విభజన తర్వాత ట్రాఫిక్ పెరిగింది. అందుకు తగ్గట్లుగానే ట్రాఫిక్ కానిస్టేబుళ్లను వేస్తున్నారు. కానిస్టేబుళ్లు లేకపోవడంతో.. షరా మామూలుగా హోంగార్డులకు డ్యూటీలు వేశారు. అలాగే ఓ హోం గార్డు స్ట్రిక్టుగా డ్యూటీ చేయబోయి.. సహచర కానిస్టేబుళ్ల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు.

కానిస్టేబుళ్లు రోడ్డు మీద విచ్చలవిడిగా డ్రైవ్ చేయడమే కాకుండా.. మంచి చెప్పబోతే.. హోంగార్డును పట్టుకుని పబ్లిగ్గా చితక్కొట్టారు. కర్నూలులో జరిగిన ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో ఎస్పీ సీరియస్ అయ్యారు. ఘటనకు కారణమైన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఖాకీలు ఎప్పటికా మారతారోనని అందరూ చర్చించుకుంటున్నారు.

- Advertisment -
spot_img

Most Popular