వెలగ పూడి సచివాలయం నుంచి పరిపాలన ప్రారంభం ..

Posted November 30, 2016, 5:17 pm

Related image

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపం లోని వెలగపూడి లో నూతనం గా నిర్మించిన సచివాలయం నుంచి పరిపాలన బుధవారం ప్రారంభం అయ్యింది. ఈ సందర్భం గా సచివాలయ ఉద్యోగులు ముఖ్య మంత్రి చంద్ర బాబు కి ఘన స్వగతం పలికారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర చరిత్రలో ఇది కొత్త శకం,తెలుగు జాతి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది..అప్పుడు మద్రాస్ స్టేట్ నుంచి బైటకు రావాల్సి వచ్చింది. తరువాత కర్నూల్ నుంచి బయటకి వచ్చాము. తెలుగు వారంతా కలిసి ఉండాలంటే హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఆ నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం,9 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపాను,అన్యాయంగా, ఆశాస్త్రీయంగా విభజన చేసి వెళ్లగొట్టారు రాజకీయ కారణాలతో హేతుబద్దత లేకుండా రాష్ట్ర విభజన చేశారు.రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ తో మన కొత్త ప్రయాణం ప్రారంభించాం.ఇది రెండో మజిలీ,ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించడమే నా ప్రధమ ప్రాధాన్యం.ప్రపంచంలో ఏ రాజధానికి అమరావతికి ఉన్నన్ని ఆకర్షణలు లేవు,ఒక పక్క కృష్ణా నది, పూర్తి వాస్తు, ఆహ్లాదంగా వుండే పర్వత శ్రేణులు, అంతటా పచ్చదనం అమరావతి సొంతం.ఉద్యోగుల త్యాగాలు ఊరికే పోవు, కష్టాలు, సుఖాలు, ఇబ్బందుల్లో మీతో ఉంటాను.ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నాది, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిపాలనకు సహకరించే బాధ్యత మీది

సాంకేతికతను సంపూర్ణంగా ఉపయోగించుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళదాం,మనమంతా ఒక పెద్ద కుటుంబం అని అన్నారు . ఈ కార్య క్రమం లో ముఖ్యమంత్రిని ఉద్యోగుల తరపున సాదరంగా ఆహ్వానించిన సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకుడు మురళీకృష్ణ కొత్త ఛాంబర్ లోకి ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించిన సీఎం కార్యదర్సులు సతీష్ చంద్ర, రాజమౌళి, నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్, గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు తదిరులున్నారు , అనంతరం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించి రాజధానిలో నిర్మించదలచిన రింగ్ రోడ్లపై అధికారులతో చర్చించారు.
నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు,అని హెచ్చరించారు .