రజని అల్లుడితో ఆమెకి ?

0
383
rumours of dhanush and amala paul relationship

Posted [relativedate]

rumours of dhanush and amala paul relationship
ఇప్పటికే ఓ కుమార్తె విడాకుల ఎపిసోడ్ తో బాధపడుతున్న సూపర్ స్టార్ రజని దంపతుల్ని కంగారుపెట్టే మరో వార్త చెన్నై ఫిలిం సర్కిల్స్ లో గుప్పుమంటోంది. ఇటీవలే దర్శకుడు విజయ్ తో పెళ్లి బంధానికి గుడ్ బై కొట్టిన అమల పాల్ తో రజని పెద్ద అల్లుడికి సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు రేగాయి.ఈ వార్తలో రజని కుటుంబం డిస్టర్బ్ అయ్యిందట.ఇది తెలిసిన అమల కూడా తెగ ఫీల్ అవుతోంది.ఇలాంటి పుకార్లు పుట్టించడం కన్నా దారుణం ఇంకోటి ఉండదని ఆమె అంటోంది.ధనుష్ తనకు శ్రేయోభిలాషి మాత్రమే అని ఆమె చెప్పింది.విజయ్ తో తన వివాహబంధాన్ని నిలబెట్టేందుకు ధనుష్ ఎంతో ప్రయత్నించారని …అలాంటి మనిషితో తనకు సంబంధం అంటకట్టడం కన్నా దారుణం ఉండదని ఆమె అంటోంది.

ఈ మొత్తం ఎపిసోడ్ మీద చెన్నై సర్కిల్స్ లో మరో వాదన కూడా వినిపిస్తోంది.విజయ్ నుంచి దూరమైన అమల కెరీర్ దెబ్బతీయడానికి అతని కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారట .చిత్ర పరిశ్రమలో తమ పలుకుబడిని వుపయోగించి అమలకి అవకాశాలు రాకుండా చూస్తున్నారట.అందులో భాగంగానే vip 2 సినిమాలో అవకాశం ఇవ్వొద్దని ధనుష్ మీద కూడా ఒత్తిడి తెచ్చారట .అయినా ధనుష్ ఆమెకి ఛాన్స్ ఇవ్వడంతో కక్షగట్టి ఇలా తప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారని తెలుస్తోంది.ఇదంతా ఓ సామాన్య,కింది తరగతి కుటుంబాల్లో జరిగే తంతే ఇక్కడా కనిపిస్తోంది .మహిళలని గౌరవించే విషయంలో విలువలు,ప్రమాణాలు కేవలం సినిమాల్లో చెప్పడానికేనా?

Leave a Reply