Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మోడీ రష్యా టూర్లో ఓ లేడీ జర్నలిస్టు అభాసు పాలైంది. ట్విట్టర్ కు సంబంధించి ఆమె అడిగిన ప్రశ్న నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. మోడీ ట్విట్టర్ ను ఎంతగా ఫాలో అవుతున్నారో.. మనకే కాదు ప్రపంచమంతా తెలుసు. గ్లోబల్ లీడర్స్ లో టాప్ ఫైవ్ ట్విట్టర్ ఫాలోయింగ్ ఉన్న నేతల్లో మోడీ ఒకరు. అలాంటి మోడీని రష్యాలో లేడీ జర్నలిస్టు మేగన్ కెల్లీ మాత్రం మీకు ట్విట్టర్లో అకౌంట్ ఉందా అంటూ అడిగిన ప్రశ్న నవ్వులపాలైంది.
సెయింట్ పీటర్స్ బర్గ్ లో బిజీబిజీగా ఉన్న మోడీ.. కొంతమంది జర్నలిస్టులకు ఇంటర్వ్యూలిచ్చారు. ఆ సందర్భంగా మేగన్ కెల్లీ అనే లేడీ జర్నలిస్టుతో కరచాలనం చేసిన మోడీ.. మీ ట్విట్టర్ స్టేటస్ బాగుంది. గొడుకు పట్టుకుని దిగిన ఫోటో చక్కగా ఉందని కామెంట్ చేశారు. దీంతో ఆశ్చర్యపోయిన కెల్లీ బ్యాలెన్స్ తప్పి.. మీరు ట్విట్టర్లో ఉన్నారా అంటూ అడిగింది. దీంతో మోడీ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.
కానీ కెల్లీ మీద సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిసింది. దేశాధినేతను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కనీస కసరత్తు చేయకుండా ఎలా వస్తారని నిలదీశారు నెటిజన్లు. ఆమె పరువుతో పాటు రష్యా పరువు, సదరు ఛానెల్ పరువు కూడా పోయిందని తిట్ల దండకం అందుకున్నారు. ఇలాంటి వాళ్లకు ఉద్యోగాలెందుకు ఇస్తారని ప్రశ్నించారు నెటిజన్లు. దీంతో సదరు ఛానెల్ యాజమాన్యం కూడా కెల్లీకి తలంటిందట.