కేవీపీకి కాంగ్రెస్ హ్యాండ్ ?

  sabbam hari said congress hand to kvp
రెండేళ్లుగా మౌనం పాటించిన అనకాపల్లి మాజీ ఎంపీ,జగన్ పాత మిత్రుడు సబ్బం హరి గొంతు విప్పారు.వెంకయ్యనాయుడు ABN ఛానల్ లో బిగ్ డిబేట్ కి వచ్చిన సందర్భంగా సబ్బం హరి లైవ్ లోకి వచ్చారు.ఏ పార్టీతో సంబంధం లేకపోవడంతో సబ్బం స్వేచ్ఛగా తన అభిప్రాయాలని వెల్లడించారు.విభజన నాటి పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చుకుని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం పేరుకి మాత్రమే ఉందని…జాతీయ పార్టీల అధినేతలు ఏమి అనుకుంటే అదే జరుగుతుందని సబ్బం కుండబద్దలు కొట్టారు.ఒక ఎంపీ వ్యక్తిగతంగా పార్లమెంట్ లో ఏమీ చేయలేదని కూడా తేల్చేశాడు.
విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి,కేవీపీ లాంటి కొందరు ఆపడానికి గట్టి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయిందని సబ్బం చెప్పారు.ఆ సమయంలో కూడా కొందరు సోనియా గాంధీని చూసి వెనుకెనుక నక్కారని…అలాంటి ఘటనలు చూశాక…కాంగ్రెస్ హైకమాండ్ ధోరణి గమనించాక రాజకీయాలకి దూరంగా ఉంటున్నట్టు కూడా సబ్బం వివరించారు.

కాంగ్రెస్ హోదా పోరాటాన్ని కూడా సబ్బం తప్పుబట్టారు.ప్రైవేట్ బిల్లు పెట్టిన కేవీపీని జైరాం రమేష్,గులాం నబి ఆజాద్ లాంటి నేతలు ఒంటరిని చేసి మోసగించాయని కూడా హరి అభిప్రాయపడ్డారు.కేవలం రాజకీయం కోసమే కాంగ్రెస్ హోదా అంశాన్ని లేవనెత్తింది తప్ప ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని సబ్బం వ్యాఖ్యానించారు.ప్రైవేట్ బిల్లు పెట్టిన కేవీపీని కాంగ్రెస్ ఎలా దెబ్బ కొట్టిందో తెలిసినా బయటకి చెప్పలేనని అయన అన్నారు.హోదా పేరుతో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కి సబ్బం భారీ ఝలక్ ఇచ్చినట్టే..

SHARE