బాబుకి జగన్ పాతమిత్రుడు వత్తాసు..

  sabbam hari scold to jagan abn live chat

సబ్బం హరి …అనకాపల్లి మాజీ ఎంపీ ..అంతకన్నా జగన్ ని తొలుత బలపరిచిన నేత.వైసీపీ ఏర్పాటు తర్వాత వచ్చిన విభేదాలతో సబ్బం కొన్నాళ్ళు జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడినా ఆపై మౌనం దాల్చారు.ఇన్నాళ్టికి నోరువిప్పిన అయన జగన్ పేరు చెప్పకుండానే ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరుని తప్పుబట్టారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో చాకచక్యంగా రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరిస్తే కొద్దిమంది పార్టీ సానుభూతిపరుల్ని అడ్డుపెట్టుకుని అడ్డంకులు కల్పిస్తున్నారని సబ్బం ఆరోపించారు.

ఈ వ్యవహారం ఒక్క రాజధాని విషయంలోనే కాదు మిగిలిన భూసేకరణ జరిగే అన్ని చోట్ల ఇదే రకంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారని అయన అన్నారు.మొత్తం ఐదేళ్లు ఇలాగే అడ్డంకులు కలిపించి తర్వాత బాబు వల్ల అభివృద్ధి సాధ్యం కాదని..మాకు ఓట్లేస్తే ఏదో చేస్తామని ప్రజల్ని నమ్మించడానికి కుట్ర పన్నారని సబ్బం పరోక్షంగా వైసీపీ మీద విరుచుకుపడ్డారు.అంతే కాదు …బాబులా 33 వేల ఎకరాలు సాధించడం దేశంలో ఎవరివల్ల కాదని సబ్బం కితాబిచ్చారు.మొత్తానికి మౌనం వీడిన సబ్బం మాటలు వైసీపీ గుండెల్లో బాంబులై పేలుతున్నాయి.

SHARE