“వీడెవడు” తోనైనా సచిన్ సక్సెస్ అవుతాడా?

  Posted March 27, 2017sachiin joshi veedevadu movie theatrical trailer release

సచిన్ జోషి… ఇతని సినీ కెరీర్ ని పరిశీలిస్తే అన్నీ అపజాయాలే తగులుతాయి. మౌనమేలనోయి సినిమా నుండి మొగలి పువ్వు సినిమా వరకు సచిన్ పలు మూవీస్ తో టాలీవుడ్ మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. అయినా కానీ హిట్ అందుకోలేకపోయాడు అన్నది ఒప్పుకోవాల్సిన నిజం. తాజగా సచిన్ వీడెవడు అనే టైటిల్ తో ఓ డిఫరెంట్ సినిమాను చేశాడు. ఈ సినిమాకు అఖిల్, కోలీవుడ్ హీరో ఆర్యలతో మాంచి పబ్లిసిటీ కూడా చేయించాడు.

వీడెవడు అంటూ అఖిల్ తన ట్విట్లర్ లో… అటుతిరిగి ఉన్న ఓ హీరో పిక్ ని  పోస్ట్ చేయగా, ఆర్య యార్ ఇవాన్ అంటూ ప్రశ్నించాడు. అతను ఓ క్రికెటర్ అని, బాలీవుడ్ సూపర్ స్టార్ అని, తమిళ్ లో డెబ్యూ చేయనున్నాడని ఇలా కావాల్సినంత పబ్లిసిటీ ఇచ్చారు. ఆ తర్వాత విడుదలైన మోషన్ పిక్చర్ లో అతను సచిన్ జోషి అని తెలుసుకున్నారు అభిమానులు. స్వయంగా అక్కినేని అఖిల్, ఆర్య లాంటి హీరోలు ట్విట్టర్లలో పోస్ట్ చేయడంతో సినిమాకు హైప్ వచ్చింది.  మర్డర్ మిస్టరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సచిన్ సరసన ఈషా గుప్తా హీరోయిన్ గా నటించనుంది. తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కొద్ది సేపటి క్రితమే చిత్ర యూనిట్ ధియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. ఆకట్టుకునే విధంగానే ట్రైలర్ ని కూడా కట్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న ఈ సినిమాతోనైనా సచిన్ జోషి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

SHARE