చేతకాని పనిలో సచిన్ వేలు…

0
469

sachin parikar sanjay
ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో భేటీతో మరింత సంచలనం రేగింది. మాస్టర్ వివాదానికి సంబంధించి పలు రూమర్లు షికార్లు చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి ప్రాంతంలో ల్యాండొల్ కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఉంది.
ఈ ప్రాంతానికి దగ్గర్లో సచిన్ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సంజయ్ నారంగ్ కు చెందిన రిసార్ట్స్ ఉన్నాయి. ఐతే నారంగ్ నిబంధనలకు విరుద్ధంగా రిసార్డ్స్ నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కంటోన్మెంట్ బోల్డ్ నారంగ్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

తొలుత టెన్నిస్ కోర్టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్న సంజయ్ నారంగ్ ఆ తర్వాత సకల వసతులతో కూడిన టూరిస్ట్ రిసార్ట్ నిర్మించినట్లు తెలుస్తోంది. సదరు ప్రాంతంలో నిర్మాణాలు నిషిద్ధమైనా అవేమీ లెక్కచేయకుండా రిసార్ట్ కట్టినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సచిన్.. ఆస్ట్రేలియా నుంచి హుటాహుటిన ఇండియాకు చేరుకున్నారు. ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను కలిశారు.

వీళ్లిద్దరి మధ్య రిసార్ట్ వివాదంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఐతే భేటీ వివరాలను అటు రక్షణ మంత్రి కార్యాలయం కానీ.., ఇటు సచిన్ గానీ బయటకు చెప్పలేదు. మొత్తానికి ప్రశాంతంగా జీవిస్తున్న సచిన్ కు పెద్ద తలనొప్పే వచ్చిపడ్డట్లుంది.

Leave a Reply