సచిన్ చేతుల మీదుగా సింధుకి ?

  sachin tendulkar presented bmw car pv sindhuసిల్వర్ స్టార్ షట్లర్ పీవీ సింధుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన కానుకను ప్రజెంట్ చేయబోతున్నాడు. ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రతిభ చూపిన సింధుకు ఆయన ఓ బీఎండబ్ల్యు కారున బహూకరిస్తున్నాడు. ఈ కారును హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వి చాముండేశ్వర్ నాథ్, ఆయన స్నేహితులు కలిసి స్పాన్సర్ చేశారు. సచిన్ చాముండికి ఆప్త మిత్రుడు. సచిన్ చేతుల మీదుగా సింధూకు దీన్ని అందచేయాలని అసోసియేషన్ తరఫున నిర్ణయించినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ పున్నయ్య చౌదరి తెలిపారు. నాలుగేళ్ళ కిందట లండన్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన సైనా నెహ్వాల్ కు కూడా ఓ బీఎండబ్ల్యూను సచిన్ ప్రజెంట్ చేశాడు. 2012లో ఏషియా యూత్ అండర్ 19 ఛాంపియన్ షిప్ గెల్చుకున్నపుడు సచిన్ సింధూకు మారుతి స్విఫ్ట్ కారు బహూకరించాడు.

SHARE