సాహసం శ్వాసగా సాగిపో మూవీ రివ్యూ…

0
700
sahasam swasaga sagipo movie review

Posted [relativedate]

sahasam swasaga sagipo movie reviewచిత్రం : సాహసం శ్వాసగా సాగిపో (2016)
నటీనటులు : నాగ చైతన్య, మంజిమ మోహన్
సంగీతం : ఎ. ఆర్ రెహమాన్
దర్శకత్వం : గౌతమ్ మీనన్
నిర్మాత : మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి
రిలీజ్ డేట్ : 11నవంబర్, 2016.

‘ఏమాయ చేశావే’ నాగ చైతన్య జీవితాన్ని మార్చేసిన చిత్రం. కెరీర్ పరంగా మొదటి హిట్టిచ్చిన చిత్రమిది. పర్సనల్ లైఫ్ కోసం పాట్నర్ ని ఇచ్చిన చిత్రం కూడా ఇదే. ఈ సినిమా కోసం చైతూ-సమంత తొలిసారి జతకట్టారు. వచ్చే యేడాది ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది. సమంతకి ఇదే తొలిచిత్రం కాగా, చైతూకి ఇది రెండో చిత్రం. చైతూ ‘జోష్’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన విషయం తెలిసిందే. దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమాయ చేశావే’తెలుగు ప్రేక్షకులని బాగా నచ్చేసింది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఓ స్టార్ హీరోయిన్ ని అందించాడు గౌతమ్ మీనన్.

ఇప్పుడు మరోసారి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య చేసిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ చిత్రంలో చైతూ సరసన మంజిమ మోహన్ జతకట్టనుంది. ‘ఏమాయ చేశావే’ కంప్లీట్ రొమాంటిక్ సినిమా. అయితే, ‘సాహసం శ్వాసగా సాగిపో’ మాత్రం ఫస్టాఫ్ అంతా రొమాంటిక్ సీన్స్ తో సరదాగా సాగుతుందట. సెకాంఢాఫ్ మాత్రం థ్రిల్లర్, యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఎక్స్ పెక్టేషన్స్ :
‘ప్రేమమ్’తో తొలిసారి నటుడిగా ఫుల్ మార్కులు కొట్టేశాడు నాగ చైతన్య. దీంతో.. ఈ చిత్రం తర్వాత వస్తోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్.పైగా..గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.సినిమా స్టయిలీష్ గా తీయడం గౌతమ్ మీనన్ ప్రత్యేకత.’సాహసం శ్వాసగా సాగిపో’ కూడా హిట్ అయితే, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొన్న హీరోగా చైతూ క్రేజ్ మరింత పెరిగిపోవచ్చు.మరి..ఇన్ని అంచనాల మధ్య ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన  ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది. ఈ చిత్ర కథేంటీ.. ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
సరదాగా తిరిగే కుర్రోడు రజనీకాంత్ (నాగ చైతన్య). తన సిస్టర్ స్నేహితురాలు లీలా (మంజిమ మోహన్)తో ప్రేమలో పడతాడు. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట ఓ రోడ్ ట్రిప్ కి వెళుతుంది. ఈ ట్రిప్ వారి జీవితాలని ఎలా మార్చింది.. ? ఈ ప్రేమ జంటపై ఎటాక్ చేసిన వారు ఎవరు.. ? ఈ సమస్యల నుంచి ప్రేమ జంట ఎలా బయటపడింది అనే అంశాన్ని థ్రిల్లింగ్, యాక్షన్ సన్నివేశాలతో కూడినదే మిగితా కథ.

 ప్లస్ పాయింట్స్ :
* ఫస్ట్ హాఫ్
* సంగీతం
* పాటలు

మైనస్ పాయింట్స్ :
* స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
గౌతమ్ మీనన్ మార్క్ మూవీ ఇది. ఫస్టాఫ్ అంతా సరదా సరదా గా సాగేలా చూసిన దర్శకుడు.సెకాండాఫ్ యాక్షన్ లోకి దించేశాడు.అయితే,స్లో నేరేషన్ప్రేక్షకుడిని బాగా ఇబ్బంది పెట్టేలా ఉంది.స్క్రీన్ ప్లే లో గౌతమ్ మీనన్ మార్క్ కనిపించింది.ప్రేమకథలకి కేరాఫ్ అడ్రస్ గా చైతూ మారాడు అన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు.ఎప్పటిలాగే ప్రేమికుడిగా నాగ చైతన్య ఒదిగిపోయాడు. ప్రేమలోని అన్ని ఎమోషన్స్ ని అద్భుతంగా పండించాడు. ‘ప్రేమమ్’లో చూపించిన నటనకి ఈ సినిమాలోనూ ఏమాత్రం తీసిపోకుండా చేశాడు. హీరోయిన్ మంజిమా మోహన్ నటనతో ఆకట్టుకొంది. చైతూ-మంజిమ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది.

బాబా సెహగల్ విలనీజం బాగుంది. రానా దగ్గుపాటి కనిపించి తెలుగు ప్రేక్షకులని థ్రిల్ చేశారు. అజయ్ గొల్లపుడి, సత్య శివ ల నటన బాగుంది.మిగితా నటీనటులు తమ తమ పరిథి మేరకు చేశారు.

సాంకేతికంగా :
గౌతమ్ మీనన్ మరోసారి స్టయిలీష్ టేకింగ్ తో ఆకట్టుకొన్నాడు. అయితే,స్లోనేరేషన్ సినిమా రిజల్ట్ ని దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఏ. ఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. అయితే, ఫస్టాఫ్ లో వచ్చే పాటలన్నీ చూడ్డానికి తెరపై బాగున్నా.. వినడానికి బాగోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. తెరపై సినిమా రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్భ్.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
ప్రేమకథా సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు, అందులోనూ గౌతమ్ మీనన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా కనెక్ట్ అవుద్ది. సింపుల్ చెప్పాలంటే.. ఓసారి చూసెయొచ్చు.

 బాటమ్ లైన్ : సాహసం శ్వాసగా సాగిపో.. సరదా సాగి.. యాక్షన్ మొదలైంది

రేటింగ్ : 3.25/5

Leave a Reply