మెగా కాంపౌండ్ నుండి ఎంట్రీ ఇవ్వనున్న మరో హీరో..!!

115

Posted [relativedate]

sai dharam tej brother vaishnav tej entry in tollywoodమెగా కాంపౌండ్… ఈ పేరు చెబితే చాలు అభిమానుల  ఉత్సాహానికి అవధులు ఉండవు. ఆ కాంపౌండ్ నుండి ఏ హీరో సినిమా వచ్చినా, అది మినిమమ్ గ్యారెంటీ సినిమానే. అంతలా అభిమానులు మెగా హీరోల సినిమాలను ఆదరిస్తుంటారు. తాజాగా ఈ కాంపౌండ్ నుండి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడట.

మెగా మేన‌ల్లుడిగా దూసుకుపోతున్న  సాయిధ‌ర‌మ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలో ముఖానికి రంగు వేసుకోనున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సాయ ధరమ్ తేజే వెల్లడించాడు. ప్రస్తుతం ఎడ్యుకేషన్ చివరి దశలో ఉన్నాడని, చదువు పూర్తవ్వగానే సినిమాల్లోకి రానున్నాడని తెలిపాడు.  వైష్ణవ్ కి కూడా సినిమాలే ప్యాషన్ అని వివరించాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో  సాగే సినిమా ద్వారా అతని ఎంట్రీ ఉండనుందని సమాచారం.

కాగా మెగా కాంపౌండ్ హీరోలందరూ మాస్ హీరోలని, ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మరో మాస్ హీరో అవుతాడో లేక క్లాస్ టచ్ ఉన్న రొమాంటిక్ హీరో అవుతాడో చూడాలని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అతను క్లాస్ హీరో అయినా మాస్ హీరో అయినా మెగా అభిమానులకు మాత్రం పండగే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here