సాయిధరమ్‌ ‘తొలిప్రేమ’..!

0
717
Sai Dharam Tej is preparing to take the pawan tholi prema movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Sai Dharam Tej is preparing to take the pawan tholi prema movie
మెగా బ్రదర్స్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మేనమామలను ఇమిటేట్‌ చేస్తూ మెగా ఫ్యాన్స్‌ అభిమానాన్ని చూరగొన్నాడు. ఇప్పటికే పెద మామ చిరంజీవి సుప్రీం బిరుదును తనవశం చేసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పుడు చినమామ క్రేజ్‌ను సొంతం చేసుకునేలా ప్లాన్‌ చేస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ చిత్రాల జాబితాలో ఉండే ‘తొలిప్రేమ’ తరహా సినిమా చేసేందుకు సాయి ధరమ్‌ తేజ్‌ సిద్దం అవుతున్నాడు. ఆ చిత్ర దర్శకుడు కరుణాకరన్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

ప్రస్తుతం బివిఎస్‌ రవి దర్శకత్వంలో ‘జవాన్‌’ చిత్రాన్ని చేస్తున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఆ తర్వాత సినిమాగా కరుణాకరన్‌ సినిమాను చేయబోతున్నాడు. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను, ఎన్నో మంచి ప్రేమ కథలను అందించిన ఈ దర్శకుడు ఇప్పుడు కాస్త వెనుక పడ్డాడు అని చెప్పాలి. ఈయన చివరిగా తెరకెక్కించిన ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది. దాంతో చాలా కాలం నుండి సినిమాలేం చేయకుండా ఖాళీగా ఉన్న కరుణాకరన్‌ ఎట్టకేలకు ఒక తొలిప్రేమ వంటి కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. అయితే ఇదే కథతో అప్పట్లో నితిన్‌ హీరోగా చేయాలని భావించాడని, అయితే ఆ సినిమా క్యాన్సిల్‌ అవ్వడంతో సాయి ధరమ్‌ తేజ్‌ వద్దకు ఆ కథ వచ్చిందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఆ కథ ఏంటి అనేది మాత్రం కరుణాకరన్‌ చెప్తే కాని క్లారిటీ రాదు. కథ ఏది అయినా మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌కు ఒక మంచి సినిమా పడటం ఖాయంగా అనిపిస్తుంది.

Leave a Reply